»Finally Indian 2 Is Ready For Release Is Prabhas Kalki The Target
Indian 2: ఎట్టకేలకు ‘ఇండియన్ 2’ రిలీజ్‌కు రెడీ? ప్రభాస్ ‘కల్కి’నే టార్గెట్?
స్టార్ డైరెక్టర్ శంకర్ ఒకేసారి రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఇండియన్ 2, గేమ్ చేంజర్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఎట్టకేలకు ఇండియన్ 2 రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చేసినట్టేనని అంటున్నారు.
Finally 'Indian 2' is ready for release? Is Prabhas 'Kalki' the target?
Indian 2: వాస్తవానికైతే.. ఇండియన్ 2 సినిమా ఎప్పుడో కంప్లీట్ కావాల్సి ఉంది. కానీ.. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు దర్శకుడు శంకర్. ఇండియన్ 2ని పూర్తిగా పక్కకు పెట్టేసి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో గేమ్ చేంజర్ సినిమా స్టార్ట్ చేశాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అయితే.. కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా హిట్ అవడంతో.. సడెన్‌గా ఇండియన్ 2ని లైన్లోకి తీసుకొచ్చాడు. దీంతో రెండు సినిమాలను ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు శంకర్. అయితే.. ముందుగా ఇండియన్ 2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు. కానీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఫైనల్‌గా ఇండియన్ 2 రిలీజ్‌కు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. సమ్మర్ కానుకగా మే నెలలో ఈ చిత్రాన్నిరిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
భారతీయుడు సినిమా 1996 మే 9న రిలీజ్ అయింది. దీంతో.. ఇదే డేట్‌కు ఇండియన్ 2 రావాలనుకున్న కూడా.. ఇప్పటికే ఆ రోజు ప్రభాస్ ‘కల్కి’ డేట్ లాక్ చేసేశారు. దీంతో రెండు వారాల గ్యాప్‌లో ఇండియన్ 2 రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. లేదంటే.. కల్కి డేట్‌ను టార్గెట్ చేసి ఉండేది ఇండియన్. అందుకే.. మోస్ట్లీ మే 23ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. లేదంటే.. మే లాస్ట్ వీక్‌లో విడుదల అవడం పక్కా అంటున్నారు. అతి త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. ఇండియన్ 2 రిలీజ్ డేట్ లాక్ అయితే గానీ.. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రాదు. ఇదిలా ఉంటే.. కల్కి మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు కమల్ హాసన్. దీంతో మే నెలలో కమల్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా అనే చెప్పాలి.