»A Recent Study By Science Journal Vaccines More Risks Corona Vaccines
Corona Vaccines: కొవిడ్ టీకాలే ఈ అనర్థాలకు కారణమా? భయపెడుతున్న అధ్యయనం
కరోనా వైరస్ విలయతాండవం చేసిన సమయంలో కోవిడ్ వ్యాక్సిన్స్ శ్రీరామ రక్షగా నిలిచాయి. అయితే అవే ఇప్పుడు మనుషుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నాయి అని తాజా అధ్యయనం వెల్లడించింది. ఏ వ్యాక్సిన్ వలన ఏ ప్రమాదం పొంచి ఉందో వెల్లడించారు.
A recent study by Science Journal 'Vaccines' more risks corona vaccines
Corona Vaccines: కరోనా వైరస్ సృష్టించిన మారణహోమం ఇంకా ఎవరు మరిచిపోలేదు. ఆ సమయంలో శ్రీరామ రక్షగా నిలిచాయి వ్యాక్సిన్స్. వ్యాక్సిన్లు మార్కెట్లోకి వచ్చాకా ప్రజలకు కాస్త ధైర్యం వచ్చింది. ఇప్పుడిప్పుడు ప్రజలు సామాన్య జీవనం సాగిస్తున్నారు. ఈ లాంటి సందర్భాల్లో వ్యాక్సిన్లు మానవాలికి ప్రయోజనం కన్నా ఎక్కవ ప్రమాదలే కలుగుజేస్తున్నాయి అన్న వార్త అందరిలో కలవరం రేపుతుంది. వ్యాక్సిన్ సైన్స్ జర్నల్ తాజా అధ్యయనాన్ని ప్రచురించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పరిశోధనా విభాగం గ్లోబల్ వ్యాక్సిన్ డేటా నెట్వర్క్ పరిశోధకులు కొవిడ్-19 వ్యాక్సిన్లు ‘ప్రత్యేక ప్రతికూల సంఘటనలు’గా పరిగణించే 13 వైద్య సమస్యలను గుర్తించారు.
అర్జెంటినా, ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, స్కాట్లాండ్ దేశాల్లో కొవిడ్ టీకా తీసుకున్న 99 మిలియన్ల మందిపై అధ్యయనం నిర్వహించారు. ఎంఆర్ఎన్ఏ టీకా తీసుకున్న వారిలో హృదయ కండర వాపునకు కారణమయ్యే మయోకార్డిటిస్ను గుర్తించారు. ఫైజర్-బయోఎన్‌టెక్, మోడెర్నా టీకాలు ఎంఆర్ఎన్ఏ టీకాలే. ఈ టీకాలు తీసుకున్న వారిలో మయోకార్డిటిస్ కేసులను కనుగొన్నారు. రెండో డోస్ తీసుకున్న వారిలో 6.1 రెట్లు ఎక్కువగా ముప్పు ఉందని వెల్లడించారు.
ఆస్ట్రాజెనెకా టీకా మూడో డోసు తీసుకున్నవారిలో పెరికార్డిటిస్ అనే గుండెకు సంబంధించిన ప్రమాదం 6.9 రెట్లుగా ఉన్నట్లు గుర్తించారు. మోడెర్నా టీకా తీసుకున్న వారిలో 2.6 రెట్లు ఈ ప్రమాదం పెరిగినట్టు అధ్యయనం పేర్కొంది. ఆస్ట్రాజెనెకా షాట్ తీసుకున్న వారు అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన గ్విలియన్ బారే సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడించారు. వారిలో రక్తం గడ్డకట్టే ప్రమాదం 3.2 రెట్లు ఎక్కువ అని అధ్యయనం తేల్చింది. మోడెర్నా టీకా తీసుకున్న తర్వాత న్యూరోలాజికల్ డిజార్డర్ అయిన అక్యూట్ డిసెమినేటెడ్ ఎన్సెఫలోమైలిటిస్ వచ్చే ప్రమాదం 3.8 రెట్లు ఎక్కువగా ఉందని, ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న తర్వాత ఈ ముప్పు 2.2 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనం నివేదించింది.