Game Changer leaked: ‘గేమ్ చేంజర్’ లీక్డ్ వీడియో.. ఇలా అయితే కష్టమే?
అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. ఈపాటికే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యేది.. ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు నమోదు అయి ఉండేవి. కానీ శంకర్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ చేయాల్సి రావడంతో.. మరింత వెనక్కి వెళ్లింది గేమ్ చేంజర్. అయినా లీకులు మాత్రం అగడం లేదు.
Game Changer leaked: దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టి రెండు, మూడెళ్లు అవుతోంది. అయినా కూడా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు కదా.. కనీసం గేమ్ చేంజర్ అప్డేట్ కూడా బయటికి రావడం లేదు. ముందుగా ‘భారతీయుడు 2’ కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు శంకర్. ఈ కారణంగానే గేమ్ చేంజర్ డిలే అవుతోంది. ఈ విషయంలో మెగా ఫ్యాన్ కాస్త గట్టిగానే అప్సెట్ అవుతున్నారు. అయితే గేమ్ చేంజర్ నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయినా కూడా.. అప్పుడప్పుడు ఈ సినిమా నుంచి లీకైన ఫోటోలు, వీడియోలతో సరిపెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. గతంలో కీలక సన్నివేశాలకు సంబందించిన ఫోటోలు, వీడియోలు చాలా సార్లు లీక్ అయ్యాయి. చెప్పాలంటే.. ప్రతి షెడ్యూల్ నుంచి లీకులు వచ్చాయి.
ఇక ఇప్పుడు మరోసారి గేమ్ చేంజర్ నుంచి ఓ వీడియో లీక్ అయ్యింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ హెలికాఫ్టర్ సీన్ లీక్ అయినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ ఓ మార్కెట్ ఏరియాలోకి ఏకంగా హెలికాప్టర్‌తో ఎంట్రీ ఇస్తున్నట్టుగా ఈ లీకేజీ చెబుతోంది. దీంతో ఓ యాడ్ షూట్ కోసం వాడిన రామ్ చరణ్ హెలీకాప్టర్ షాట్‌ను వైరల్ చేస్తూ.. ఇంతకుమించిన ఎలివేషన్, గూస్ బంప్స్ మ్యూజిక్ పడితే చాలు.. థియేటర్లు దద్దరిల్లిపోతాయ్ అని కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. కానీ మేకర్స్.. ఇలాంటి లీకుల్ని ఎందుకు కంట్రోల్ చేయడం లేదని ఫైర్ అవుతున్నారు. ఇలా అయితే కష్టం.. సినిమా మొత్తం లీక్ అయ్యేలా ఉందని అంటున్నారు. మరి గేమ్ చేంజర్ లీకుల్ని ఇప్పటికైనా ఆపుతారేమో చూడాలి.