NDL: జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. బేతంచర్లలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. డోన్, శ్రీశైలం, నందికొట్కూరు వంటి ప్రాంతాల్లో కూడా 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో వేడి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.