Marriage: దారుణం.. కూతురిని పెళ్లి చేసుకున్న తండ్రి
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం. ప్రతీ ఒక్కరూ తమ పెళ్లి ఉన్నంతలో అంగరంగ వైభవంగా చేయాలని భావిస్తారు. ముఖ్యంగా మన భారత దేశంలో పెళ్లికి మరదలు వరుస అయ్యే వారిని లేదా కోడలు వరసయ్యే వారిని చేసుకుంటూ ఉంటారు.
Marriage: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం. ప్రతీ ఒక్కరూ తమ పెళ్లి ఉన్నంతలో అంగరంగ వైభవంగా చేయాలని భావిస్తారు. ముఖ్యంగా మన భారత దేశంలో పెళ్లికి మరదలు వరుస అయ్యే వారిని లేదా కోడలు వరసయ్యే వారిని చేసుకుంటూ ఉంటారు. కానీ సొంత బిడ్డలను మాత్రం ఎవరు పెళ్లి చేసుకోరు. కానీ ఇక్కడ సొంత కూతుర్లనే పెళ్లి చేసుకుంటారట. మరి ఈ వింత ఆచారం అట అలాంటి ప్రాంతం ఎక్కడుందో తెలుసా? ఈ రోజుల్లో వివాహాలు చాలా భిన్నంగా జరుగుతున్నాయి. గతంలోలాగా వావి, వరుసలు చూడడం లేదు. పెళ్లి అనే పదానికి అర్థం మార్చేస్తున్నారు. తాజాగా ఓ తండ్రి తన పెద్ద కుమార్తెను పెళ్లి చేసుకున్న వార్త వెలుగులోకి వచ్చింది.
బంగ్లాదేశ్‌లోని మండి తెగలో శతాబ్దాలుగా ఒక వింత ఆచారం కొనసాగుతోంది. కూతురికి యుక్తవయస్సు రాగానే తండ్రి భర్త అవుతాడు. అంతేకాదు పెళ్లయిన తర్వాత చిన్నవయసులో భర్త చనిపోవడంతో ఒక మహిళ వితంతువుగా మారితే, మరో వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఈ వివాహంలో అతను తన భార్యగా ఆమెకు అన్ని హక్కులను ఇస్తాడు. అంతేకాదు పెళ్లయిన అమ్మాయికి అప్పటికే ఆడపిల్ల పుట్టి ఉంటే, ఆమె యుక్తవయస్సు వచ్చిన తర్వాత ఈ వ్యక్తి మళ్లీ పెళ్లి చేసుకుంటాడనే ఆచారం ఉంది. అంటే ఈ తెగలో తండ్రి, కూతురిని పెళ్లి చేసుకునే ఆచారం చాలా ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుందట. దీని గురించి బయటకు రావడంతో నెటిజన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.