»When The Abuse Of The Daughter Started Prem Gupta Conducted A Solemn Divorce Ceremony For The Witness
Divorce procession: బ్యాండు బాజాలతో పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రి
అత్తవారింట్లో ఇబ్బంది పడుతున్న కూతుర్ని బాజాలతో ఘనంగా పుట్టింటికి తీసుకొచ్చాడు. విడాకులు తీసుకోవాలనే కూతురు నిర్ణయాన్ని గౌరవించి విడాకులు ఊరేగింపు వేడుక నిర్వహించాడు ఓ తండ్రి.
Divorce procession: కూతురుకి పెళ్లి చేసి బ్యాండు బాజాలతో ఊరేగింపుగా అత్తవారింటికి పంపిస్తారు. జార్ఘండ్‌లో దీనికి భిన్నంగా ఓ ఘటన జరిగింది. అత్తవారింట్లో తన కూతురు అనుభవిస్తున్న కష్టాలను చూసి తట్టుకోలేక ఆ తండ్రి.. కూతురిని మేళతాళాలు, బాణసంచాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకొచ్చారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. రాంచీలో నివసించే ప్రేమ్ గుప్తా తన కూతురు సాక్షిను సచిన్ కుమార్‌కు ఇచ్చి గతేడాది పెళ్లి చేశారు. కొన్నాళ్లకే సాక్షికి వేధింపులు స్టార్ట్ అయ్యాయి. ఇద్దరి మధ్య విభేదాలు రావడం ప్రారంభం అయ్యాయని ప్రేమ్ గుప్తా చెబుతున్నారు.
సచిన్‌కు అంతకుముందే వివాహం జరిగిందని తెలిసినా.. అతనితో బంధం కొనసాగించాలని సాక్షి ముందే నిర్ణయించుకున్నారు. వేధింపులు ఎక్కువ కావడంతో తనతో కలిసి ఉండటం సాధ్యం కాదని తండ్రికి చెప్పింది. వైవాహిక జీవితానికి వీడ్కోలు పలకాలనే సాక్షి నిర్ణయాన్ని తల్లిదండ్రులు స్వాగతించారు. ఆమెను ఇంటికి తీసుకురావడానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. టపాసులు పేల్చుతూ పుట్టింటికి స్వాగతించారు. కన్నవారిని, పెరిగిన ఊరుని కాదని.. అత్తవారింటికి వెళ్లి, భర్త, అత్తమామలతో ఉంటారు. పిల్లలు పుట్టాక పరిస్థితి మొత్తం మారిపోతుంది. భర్త, పిల్లలే సర్వస్వం అవుతారు. మరీ అలాంటి చోట ఇబ్బందులు ఎదురైతే ఎలా.. గౌరవంగా పుట్టింటికి తీసుకురావాలని సాక్షి తండ్రి చెబుతున్నారు. సచిన్‌తో విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించారు.