»Betting In Cricket Stakes Skyrocket In Indias Dark Playgrounds In World Cup
World Cup 2023: వరల్డ్ కప్ మ్యాచ్‌లపై ఆన్లైన్ బెట్టింగ్ .. ఎన్ని లక్షల కోట్లో తెలిస్తే మైండ్ బ్లాంక్ అయిపోద్ది
ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులను ఆవహించింది. పాకిస్థాన్‌ను భారత్ ఓడించినప్పటి నుంచి... భారత్ ప్రపంచ కప్ కొట్టాలని ప్రతీ భారతీయుడు ఆశిస్తున్నాడు.
World Cup 2023: ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులను ఆవహించింది. పాకిస్థాన్‌ను భారత్ ఓడించినప్పటి నుంచి… భారత్ ప్రపంచ కప్ కొట్టాలని ప్రతీ భారతీయుడు ఆశిస్తున్నాడు. ఈ సమయంలోనే ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఆన్లైన్ బెట్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ స్కాంలో ఇండోర్ పోలీసులు ఓ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ మొత్తం బెట్టింగ్ గేమ్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లపై ఆన్లైన్లో బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు ఇండోర్ పోలీసులు పసిగట్టారు. 40 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.23 లక్షల నగదు, 1.25 కిలోల బంగారు కడ్డీని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఓ పోలీసు అధికారి వెల్లడించారు. యాంటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల సహకారంతో సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. ద్వారకాపురి ప్రాంతంలో సోమవారం రాత్రి అరెస్టు చేసిన నిందితుడిని విశాల్ మెహతాగా గుర్తించినట్లు అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభినయ్ విశ్వకర్మ తెలిపారు.
బ్లాక్ గేమ్ విలువ రూ.3 లక్షల కోట్లకు పైమాటే
బెట్టింగ్‌ల ఈ బ్లాక్ గేమ్ మొత్తం విలువ వింటే మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఈ బెట్టింగ్ విలువ రూ. 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ. బెట్టింగ్ బ్లాక్ గేమ్ ఈ స్థాయిలో జరుగుతున్నప్పుడు దానిని చట్టబద్ధం చేయాలన్న డిమాండ్ కూడా తెరపైకి వస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్ వంటి దేశాల్లో క్రికెట్ బెట్టింగ్ చట్టబద్ధమైనది. వెస్టిండీస్ మినహా మిగతా దేశాలు ప్రపంచకప్ ఆడుతున్నాయి. భారతదేశంలో బెట్టింగ్‌ల విషయంలో 2015లో ఐపీఎల్ ఎనిమిదో సీజన్లో అహ్మదాబాద్ బ్రాంచ్ నుంచి రూ.2000 కోట్ల విలువైన రాకెట్‌ను ఈడీ ఛేదించింది.
తాజా కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన నిందితులు చాలా దారుణంగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ వ్యక్తి తన ఇంటి నుంచే ఆన్లైన్ బెట్టింగ్‌లు చేస్తుంటాడు. ఇందుకోసం ఓ వ్యక్తి నుంచి ఐడీ, పాస్వర్డ్ తీసుకునేవాడు. ఈ వ్యక్తి యూఏఈలోని మొబైల్ నంబర్ నుండి వాట్సాప్ వాయిస్ కాల్స్ ద్వారా మెహతాతో మాట్లాడేవాడు. ప్రపంచ కప్ మ్యాచ్‌లపై ఆన్లైన్ బెట్టింగ్ ముఠా చాలా వ్యవస్థీకృత పద్ధతిలో నడుస్తోందని, దీని లింకులు విదేశాలతో ముడిపడి ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. మెహతా వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 1.25 కిలోల బంగారం విదేశాల నుంచి అక్రమంగా భారత్‌కు తరలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు పోలీసులు ఈ విషయంపై డీఆర్ఐ, ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వబోతున్నారు.