VZM: జిల్లాలో NTR భరోసా పింఛన్లను జనవరి 1కు బదులు డిసెంబర్ 31న పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 7 నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తారన్నారు. డిసెంబర్ నెలకు సంబంధించి జిల్లాలో 2,71,697 మంది లబ్ధిదారులకు రూ.116.25 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.