లాటరీ (Lottery) అనేది ఎప్పుడూ ఎవరినీ తగులుతుందో తెలియదు. అదృష్టం వచ్చే దాకా ప్రయత్నించాలి. ఓపిక, సహనం ఉంటే లాటరీ అనేది మన ఇంటి గుమ్మం తగలొచ్చు. ఇలాంటిదే ఓ వ్యక్తి లాటరీ కొని టికెట్ పక్కన పడేశాడు. నాకు ఎక్కడా వస్తుంది లే అని భావించి దాని గురించి మరచిపోయాడు. కానీ అతడికే జాక్ పాట్ (Jockpot) తగిలింది. ఆయన లాటరీ గెలిచి ఏకంగా రూ.328 కోట్ల డబ్బు సొంతం చేసుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలో (United States of America- USA) జరిగింది.
అమెరికాలోని అయోవా (Iowa) రాష్ట్రంలోని డబ్యూక్ (Dubuque) నగరానికి చెందిన ఎర్ల్ లాపే (61) మెకానిక్ గా పని చేశాడు. వయసు మీద పడడంతో పని మానేశాడు. ఏప్రిల్ 1వ తేదీన లొట్టో అమెరికా (Lotto America) అనే లాటరీ టికెట్ కొన్నాడు. ఆ తర్వాత ఆయన దానిని పట్టించుకోలేదు. అయితే నిర్వాహకులు లాటరీ గెలుచుకున్నారు అని సమాచారం అందించారు. ‘ఏప్రిల్ ఫూల్ డే కదా.. తనను ఆట పట్టిస్తున్నారు’ అని భావించి ఊకున్నాడు. కానీ ఒకసారి కార్యాలయానికి వెళ్తే నిజంగానే లాటరీ తగిలింది. అది కూడా 40 మిలియన్ అమెరికా డాలర్లు (సుమారు రూ.328 కోట్లు) దక్కాయి. అయిత ఎర్ల్ లాపే (Earl Lape) చేసిన తప్పిదంతో అతడికి కేవలం 21.28 మిలియన్ డాలర్లు (సుమారు రూ.174 కోట్లు) అందాయి. ఎందుకంటే డబ్బు అనేది ఒకేసారి కావాలని కోరాడు. లేకపోతే రూ.328 కోట్లు అనేది 29 సంవత్సరాల్లో విడతల వారీగా అతడికి దక్కేది. ఏది ఏమైనా వచ్చిన దానితో అతడు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.
వచ్చిన డబ్బుతో ఏం చేస్తావని అడిగితే సహాయ కార్యక్రమాలకు వినియోగిస్తానని ఎర్ల్ లాప్ తెలిపాడు. ‘వచ్చిన సొమ్ముతో కుటుంబ అవసరాలకు ఖర్చు చేస్తా. వాటిలో కొంత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు వినియోగిస్తా’ అని ఎర్ల్ లాప్ వివరించాడు. కాగా లాటరీలో దాదాపు 10 శాతానికి పైగా నగదు పన్ను రూపంలో ప్రభుత్వానికి వెళ్లింది. పన్ను మినహాయింపు అనంతరం ఎర్ల్ లాప్ కు రూ.140 నుంచి 150 కోట్లు వచ్చే అవకాశం ఉంది.