పరీక్ష పాస్ కావాలంటే ఏం చేయాలి? కష్టపడి చదవాలి. కానీ, ఓ విద్యార్థి (Student) తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. పాస్ మార్కులు వేయాలని అభ్యర్థిస్తూ ఆన్సర్ షీట్లలో కరెన్సీ నోట్లు పెట్టాడు. ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా (Arun Bothra) తెలిపాడు. ఆన్సర్ షీట్లను తెరిచినప్పుడు రూ.100, రూ.200, రూ.500 నోట్లు కనిపించడంతో వాటిని దిద్దుతున్న టీచర్ అవాక్కవ్వాల్సి వచ్చింది.ప్రస్తుత విద్యా వ్యవస్థ(Education system)పై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన అరుణ్ బోత్రాతో ఈ ఫోటోను షేర్ చేసుకున్నారు. బోత్రా ‘ఒక ఉపాధ్యాయుడు పంపిన ఫోటో. డబ్బులు విద్యార్ధులు తమకు పాస్ మార్కులు ఇవ్వాలనే రిక్వెస్ట్‌తో బోర్డు పరీక్ష యొక్క సమాధాన పత్రాల్లో ఉంచారు. ఈ ఇన్సిడెంట్ విద్యార్ధులు, ఉపాధ్యాయులు (Teachers) మొత్తం విద్యా వ్యవస్థ గురించి చెబుతోంది’ అనే శీర్షికతో పోస్ట్ చేశారు.
నెటిజన్స్‌తో పాటు కొంతమంది ఉపాధ్యాయులు సైతం ఈ పోస్ట్‌పై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘నేను పేపర్ దిద్దే సమయంలో కూడా నాకు ఇలా మూడుసార్లు రిక్వెస్ట్‌లు వచ్చాయి. డబ్బు.. లేదంటే పరీక్షలో ఇచ్చే ప్రశ్నలకు సమాధానంగా తమ ఎమోషనల్ స్టోరీ (emotional story)ని రాస్తారు. అలాంటి స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’ అంటూ ఒక ఉపాధ్యాయుడు చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.విషయం ఏమిటంటే ఇదే విధమైన అనుభవం తమకూ ఎదురైందంటూ ట్విట్టర్ లో ఈ పోస్ట్ ను చూసి మరికొందరు టీచర్లు స్పందించారు. అడిగిన ప్రశ్నకు సమాధానానికి బదులు, ఓ విషాదగాథను రాసి, డబ్బులు ఉంచుతుండడం టీచర్లను ఆత్మరక్షణలో పడేస్తోంది. పరీక్షలో పాస్ చేసేందుకు ఎవాల్యుయేటర్ల (evaluators)కు లంచం ఇవ్వడానికి కొందరు విద్యార్ధులు ప్రయత్నించారు. ఈ విషయాన్ని స్పష్టం చేసే బోత్రా షేర్ చేయడం అందర్నీ షాక్‌కి గురి చేసింది.