»Ap Education Secretary Praveen Prakash Angry On Government Teachers
Praveen Prakash: లక్షల జీతాలు తీసుకొని.. పాఠాలు చెప్పకుంటే ఎలా.. టీచర్లపై ఫైర్
పిల్లలకు సరిగా పాఠాలు చెప్పరు, హోం వర్క్ చేశారా లేదా అనేది చూడరు.. మీకెందుకు రూ.లక్షల్లో జీతాలు అని ప్రభుత్వ టీచర్లపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
AP Education Secretary Praveen Prakash Angry On Government Teachers
Praveen Prakash: ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేది పేదలే.. ప్రైవేట్ స్కూల్కు పంపించలేని స్థోమత ఉన్న వారు ఇక్కడికి పంపిస్తారు. తమ పిల్లలకు మంచి చదువు చెప్పిస్తే.. మంచి జరుగుతుందని భావిస్తారు. విద్యాలయాలు, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వాలు నిధులను ఖర్చు చేస్తున్నాయి. అయినప్పటికీ కొందరు టీచర్లు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వహించడం లేదు.
అనంతపురంలో గల నగరపాలక పాఠశాలలు, ఆత్మకూరు మండలం పీ యాలేరు ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ శనివారం తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన ఉపాధ్యాయుల కంటే ఎక్కువ ఉన్నారని.. వారిని కూర్చొబెట్టి జీతం ఇస్తున్నారని మండిపడ్డారు. లక్షలలో జీతం తీసుకుంటే సరిపోదు.. పిల్లలకు సరిగ్గా పాఠాలు చెప్పాలి కదా అన్నారు. సరిగ్గా బోధించకుండా.. హోం వర్క్ చూడకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
యాలేరు స్కూల్లో స్మార్ట్ టీవీ ఎందుకు ఉపయోగించడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో గల ప్రభుత్వ పాఠశాలల్లో మార్పు రాకపోవడానికి అందరం కారణం అంటున్నారు. తనతోపాటు విద్యాశాఖ కమిషనర్, ఆర్జేడీ, కలెక్టర్, డీఈవోలు కూడా కారణం అని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజమే విద్య కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుంటే.. సర్కార్ ఉద్యోగం చేసే బడి పంతుళ్లు మాత్రం ఏదో టైంపాస్ చేసి వెళుతున్నారు.