»Nara Lokesh In Protest Of Chandrababus Arrest Tdp Is Ready For Another New Program
Nara Lokesh: చంద్రబాబు అరెస్ట్‌కి నిరసనగా.. టీడీపీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం
చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ వినూత్న నిరసనకు పిలుపునిచ్చారు. వైసీపీ అరాచక పాలనను అరికట్టి వాళ్లు కళ్లు తెరిపించాలని అన్నారు.
Nara Lokesh: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు వివిధ రకాల నిరసనలు చేస్తున్నారు. కేవలం టీడీపీ కార్యకర్తలు మాత్రమే కాకుండా చంద్రబాబు అభిమానులు నిరసనలు చేశారు. ఈక్రమంలో మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు, జగనాసుర దహనం వంటి కార్యక్రమాలు టీడీపీ చేపట్టింది. ప్రస్తుతం నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా టీడీపీ మరో కొత్త వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోన్న జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం. ఆదివారం రాత్రి 7.00 నుంచి 7.05 నిమిషాలు మధ్యలో కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ,వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబు గారికి మద్దతుగా "నిజం గెలవాలి" అని గట్టిగా నినదించండి. ఈ ఫోటోలు, వీడియోలు… pic.twitter.com/JyMwpN9PUm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగుతుంది. దీనిని అరికట్టి వైసీపీ కళ్లు తెరిపించాలి. ప్రస్తుతం జగనాసురుడు సాగిస్తోన అరాచన పాలన నుంచి అతని కళ్లు తెరిపిద్దామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చాడు. ఆదివారం రాత్రి 7.00 నుంచి 7.05 నిమిషాలు మధ్యలో అందకె కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబుకి మద్దతుగా ‘నిజం గెలవాలి’ అని గట్టిగా నినాదించాలని తెలిపారు. ఇలా నినాదించిన తర్వాత ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలని లోకేశ్ పేర్కొన్నారు. నిజాన్ని గెలిపించడానికి మనమందరం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు.