»Botsa Satyanarayana Chandrababu Accused In Skill Development Scam Case
Botsa Satyanarayana: మంత్రులుగా మాకు వ్యక్తిత్వాలు లేవా బొత్స ఆగ్రహం
మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో భాగంగా భీమిలిలో చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యాలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కంటే గౌరవంగా విధులు నిర్వర్తిస్తున్నామని ఆయన తెలిపారు.
Botsa Satyanarayana: ఏపీ విశాఖపట్నంలోని భీమిలిలో వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో భాగంగా మంత్రి బొత్స సత్యానారాయణ టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారం కొంతమంది చేతుల్లోనే ఉందన్న ప్రతిపక్షాల విమర్శలు అర్థం లేని మాటలని ఆయన మండిపడ్డారు. బీసీ మంత్రులైన మాకు వ్యక్తిత్వం లేదా? ఆత్మాభిమానం లేదా? చంద్రబాబు ప్రభుత్వం కంటే గౌరవంగా, ఆత్మాభిమానంతో మంత్రులుగా విధులు నిర్వర్తిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు ముసుగులో ఉన్నారని..వాళ్లది అనైతిక రాజకీయం కాదా? అని బొత్స అన్నారు.
ప్రభుత్వం పరిమితికి తగ్గుట్టుగానే అప్పులు చేస్తుందని చెప్పారు. పరిమితులు దాటితే కేంద్ర ప్రభుత్వమే అంగీకరించదని బొత్స గుర్తు చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ 600 హామీలు ఇచ్చింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. కానీ అందులో ఒకటైనా నెరవేర్చరా అని బొత్స టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నిందితుడని ఆరోపించారు. బలహీన వర్గాలకు చెందిన మంత్రులుగా మాకు వ్యక్తిత్వాలు లేవా? మేమే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చామా అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే ప్రజల ముందుకు వచ్చామని బొత్స సత్యనారాయణ అంటున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదని ప్రతిపక్ష పార్టీల నేతలు అంటున్నారు. అంతేకాదు పరిమితికి మంచి అప్పులు చేసిందని ఆరోపిస్తున్నారు.