కాలా చష్మా పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ పాట ఒకప్పుడు దుమ్ములేపింది. ఏ వేడుకలో చూసినా ఆ పాట వేసుకొని డ్యాన్స్ వేసేవాళ్లు. అకేషన్ ఏదైనా డీజే పెట్టాల్సిందే. ఆ పాట ప్లే కావాల్సిందే. ఆ పాట సృష్టించిన రికార్డ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. యూట్యూబ్ లోనూ ఆ వీడియోను కొన్ని కోట్ల మంది వీక్షించారు. బార్ బార్ దేకో సినిమాలోని ఆ పాటకు కత్రినా, సిద్ధార్థ్ మల్హోత్రా ఇద్దరూ కలిసి వేసిన డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే.
తాజాగా సేమ్ టు సేమ్ వాళ్ల స్టెప్పులను రిపీట్ చేసి రచ్చ చేశారు తైవాన్లు. మన దేశం కాకపోయినా.. మన భాష రాకపోయినా తైవాన్ ప్రజలు వాళ్ల పార్టీలో ఈ పాటను పెట్టుకొని అద్భుతంగా డ్యాన్స్ వేశారు. తాజాగా తైవాన్ల డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అబ్బ.. పిచ్చెక్కించారుపో అంటూ నెటిజన్లు ఆ వీడియోను చూసి కామెంట్లు చేస్తున్నారు.