కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాసేపు రైల్వే కూలీగా మారారు. ఢిల్లీ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో సూట్ కేసు మోశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Rahul Gandhi: లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ ప్రధాన పార్టీల నేతలు జనంతో కలిసిపోతున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాలుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురువారం రైల్వే కూలీగా మారాడు. తమను కలువాలని రైల్వే కూలీలు కోరగా.. ఢిల్లీలో గల ఆనంద్ విహార్ రైల్వేస్టేషన్ వద్దకు యువనేత వచ్చారు. తర్వాత కూలీగా మారి.. సూట్ కేస్ మోశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ చక్కర్లు కొడుతోంది.
రైల్వే స్టేషన్ వచ్చిన రాహుల్ గాంధీ (Rahul Gandhi).. కూలీల సమస్యలను తెలుసుకున్నాడు. తర్వాత కూలీకి సంబంధించి షర్ట్ వేసుకున్నాడు. దానిపైన బ్యాడ్జీ కూడా ధరించాడు. తర్వాత ఓ సూట్ కేసు ఇవ్వగా కాసేపు మోశాడు. అందరినీ కూర్చొబెట్టి మాట్లాడారు. ఏ సమస్యలు ఉన్నాయని అడిగి.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ పరిష్కరిస్తామని ప్రకటించారు.
కూలీలను రాహుల్ (Rahul) కలిసిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో షేర్ చేసింది. భారత్ జోడో యాత్రకు ఇదీ కొనసాగింపుగా రాసుకొచ్చింది. భారత్ జోడో యాత్ర ముగిసిందని.. అయినప్పటికీ రాహుల్ ప్రజలను కలుస్తున్నారని పేర్కొంది. ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ అన్నీ వర్గాలను రాహుల్ గాంధీ కలుస్తున్నారు.
आज से 30 साल पहले किसी ने सोचा था कि जिसके परिवार मै 3 4 पीएम रहे हो उनका बारिश सड़को पर घूमेगा,गेराज मै काम करेगा,खेतो मै टैक्टर चलाएगा या फिर स्टेशन पर कुलीगिरी करेगा 🤣🤣
मोदी जी ने देश बदलने को अच्छे दिन की बात कही थी लेकिन राज परिवार को किस्मत ही बदल दी ये तो कोर्स मै था ही… pic.twitter.com/hSO1ac1hP4
ఇటీవల కర్ణాటకలో విజయంతో కాంగ్రెస్ పార్టీ ఊపు వచ్చింది. తెలంగాణలో కూడా అధికారం చేపట్టాలని అనుకుంటోంది. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని.. ఈసారైనా అధికారం చేపట్టాలని భావిస్తోంది. ఆ మేరకు కార్యాచరణతో ముందుకు వెళుతోంది.