Pawan Kalyan : ఉన్నట్టుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఎందుకు వెయిట్ లాస్ అవుతున్నాడు.. అసలెందుకు డైట్ ఫాలో అవుతున్నాడు.. అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం పవన్ మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు సెట్స్ పై ఉంది. అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తవడం లేదు. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను కంప్లీట్ చేయడానికి కింద మీద పడుతున్నాడు.
ఉన్నట్టుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఎందుకు వెయిట్ లాస్ అవుతున్నాడు.. అసలెందుకు డైట్ ఫాలో అవుతున్నాడు.. అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం పవన్ మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు సెట్స్ పై ఉంది. అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తవడం లేదు. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను కంప్లీట్ చేయడానికి కింద మీద పడుతున్నాడు. కానీ అప్పుడే హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ ‘ఓజి’ మూవీని లాంచనంగా మొదలు పెట్టేశారు. అలాగే తమిళ్ హిట్ మూవీ వినోదయ సీతంను కూడా లైన్లో పెట్టాడు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఈ రీమేక్ మూవీ కోసమే.. పవన్ కళ్యాణ్ తన ఫిట్‌నెస్‌లో కొన్ని మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాస్త లుక్ మార్చి.. సన్నపడాలని భావిస్తున్నారట. అందుకోసం డైట్ కూడా ఫాలో అవుతున్నాడని సమాచారం. ఇప్పటికే స్లిమ్‌గా కనిపించేందుకు జిమ్‌లో కసరత్తులు చేసినట్టు టాక్. ఈ రీమేక్‌లో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకే 20 నుంచి నెల రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చాడని అంటున్నారు. ఇందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సాయి సరసన హాట్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సముద్రఖనినే తెలుగు రీమేక్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.