ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి గడువు ముగిసిన తర్వాత కూడా మీ పాన్ కార్డును మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ ఇందుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
కేంద్రం భారత్ బ్రాండ్ పేరుతో పప్పు, గోధుమ పిండిని విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కిలో శనగపప్పును కిలో రూ.60, కిలో గోధమ పిండి రూ.27.50కే 'భారత్' బ్రాండ్ అందిస్తోంది. ఇప్పుడు బియ్యాన్ని కూడా అందించనుంది.
రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాల పట్టి క్లింకార కేర్ టేకర్‌కు ఇచ్చే జీతం గురించి నెట్టింట్లో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.
కోతులను కరిచిన కీటకాలు మళ్లీ మనిషిని కుడితే మంకీ ఫీవర్ వ్యాధి సోకుతుందని డాక్టర్లు తెలిపారు. దీనివల్ల కర్ణాటకలో ఇద్దరు మరణించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని మహిళలు బాగా వినియోగిస్తున్నారు. ప్రీ బస్సు ప్రయాణాన్ని మామూలుగా వాడడం లేదు.
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ గురించి అందరికీ తెలిసిందే. ఈమధ్య కాలంలో ఆమె ఎంత పాపులారిటీ చెందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రోజు కొందరు నిరుద్యోగులు ఆమె ఫుడ్ స్టాల్ ముందు నిరసనకు దిగారు. కారణమేంటో తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో వైరల్ అయిన కుమారి ఆంటీ బిజినెస్‌ను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మీడియా ముఖంగా తన ఆవేదనను తెలిపింది కుమారి.
హనుమాన్ మూవీని చూస్తూ ఓ మహిళ అసహజంగా ప్రవర్తించింది. తన ప్రవర్తనకు ముందు హడలిపోయిన ప్రేక్షకులు తరువాత అర్థం చేసుకున్నారు. క్లైమాక్స్‌లో హనుమంతుడు వచ్చే సీన్‌కే సదరు మహిళ అలా చేసిందని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఉత్తరాఖండ్ ప్రసిద్ద గోరఖల్ ఆలయంలోకి చిరుత ప్రవేశించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే భక్తులు లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఆలయ కమిటీ స్పందించింది.
103 సంవత్సరాల వృద్దుడిని ఓ 49 ఏళ్ల మహిళ పెళ్లి చేసుకుంది. స్వతంత్య్ర సమరయోధుడైన ఆ వృద్ధుడిని చూసుకోవడానికే తాను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఓ రిపోర్టర్ జగన్ గురించి షర్మిలను ప్రశ్నించగా.. ఆమె మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఏఐ టెక్నాలజీతో కొందరు కేటుగాళ్లు చేస్తున్న డీప్ ఫేక్ వీడియోలు యూట్యూబ్‌కు తలనొప్పిగా మారాయి. దీంతో 404 మీడియా పరిశోధించడంతో వెయ్యి యాడ్ వీడియోలను యూట్యూబ్ తొలగించింది.
జనవరి 26 గణతంత్ర వేడుకల సందర్భంగా మన సైనికులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మన శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజెప్పేలా జవాన్లు చేసిన స్టంట్స్‌పై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
ఓ విమానం టేకాఫ్ అవడం లేటైందని ఓ ప్రయాణికుడు ఏకంగా ఎమర్జెన్సీ డోర్ తెరిచి బయటకు వెళ్లాడు. తరువాత గాల్లో ఎగిరే సమయానికి అదే డోర్ ద్వారా లోపలికి వచ్చాడు. దీనింతటికి తోటి ప్రయాణికులు కూడా మద్దతు ఇచ్చారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తే అసలు విషయం చెప్పేశాడు.
రంజీ ట్రోఫీలో హైదరాబాద్ కుర్రాడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 147 బంతుల్లోనే 300 పరుగులు చేశాడు. దీంతో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేశాడు.