A 49-year-old woman married a 103-year-old freedom fighter
Viral News: స్వతంత్య్ర సమరయోధుడై((Freedom Fighter))న ఓ 103 ఏళ్ల వృద్ధుడిని 49 ఏళ్ల మహిళ పెళ్లి చేసుకుంది. ఈ అరుదైన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకొంది. ఆ వృద్ధుడిని చూసుకోవడానికి ఏవరు లేరు. ఒంటిరిగా ఉంటున్నాడు పైగా వృద్దాప్యం దాంతో అతన్ని చూసుకోవడానికి వయసులో 54 ఏళ్ల చిన్నదైన మహిళ తనను వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చింది. వీరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
భోపాల్ కు చెందిన హబీబ్ నజర్ దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాడు. ఇప్పుడు ఆయన వయసు 103 ఏళ్లు. గతంలో ఆయనకు రెండు పెళ్లిళ్లు జరిగాయి, ఆయన ఇద్దరు భార్యలు వృద్దాప్యంతో మరణించారు. దాంతో ఆయనను పట్టించుకునే వారు లేరు. ఒంటరితనంతో బాధ పడుతున్న ఆయన్ను భర్తను కోల్పోయిన 49 ఏళ్ల ఫిరోజ్ వివాహమాడారు. గత సంవత్సరమే వీరి పెళ్లి జరిగింది. వీరికి సంబంధించిన ఫొటోలు తాజాగా వైరల్గా మారాయి. అయితే ఆ మహిళ సమ్మతితోనే తనను వివాహం చేసుకున్నట్లు నజర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కూడా బానే ఉందని చెప్పాడు.