»Kumari Aunty Unemployed Protest In Front Of Food Stall
Kumari Aunty: ఫుడ్ స్టాల్ ఎదుట నిరుద్యోగుల నిరసన.. కారణం ఇదే!
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ గురించి అందరికీ తెలిసిందే. ఈమధ్య కాలంలో ఆమె ఎంత పాపులారిటీ చెందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రోజు కొందరు నిరుద్యోగులు ఆమె ఫుడ్ స్టాల్ ముందు నిరసనకు దిగారు. కారణమేంటో తెలుసుకుందాం.
Kumari Aunty: కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ గురించి అందరికీ తెలిసిందే. ఈమధ్య కాలంలో ఆమె ఎంత పాపులారిటీ చెందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈమె ఫుడ్ కోర్టును మూసివేయాలని ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ స్టాల్ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ రోజు కొందరు నిరుద్యోగులు ఆమె ఫుడ్ స్టాల్ ముందు నిరసనకు దిగారు.
ఒక్కడు…ఒక్కడు కూడా GM నీ CM గా గుర్తించట్లే. ఆకరికి కుమారీ ఆంటీ నే CM అని అనుకున్నారో ఏమో..
బుర్ర లేని GM కంటే కర్రీ పాయింట్ Liver నయం అనుకున్నారు నిరుద్యోగులు, విద్యార్థులు, ఆటో వాలలు.
Next, ఆటో వాలలూ కూడా మీ అభర్ధనలు కుమారి ఆంటీకి ఇచ్చుకొండి.
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వివాద విషయంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మేం ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాం. మా గురించి కూడా రేవంత్ రెడ్డికి చెప్పి ఉపాధి కల్పించాలని నిరుద్యోగులు కోరారు. దీంతో కుమారి ఆంటీ, నిరుద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో కుమారి ఆంటీ, నిరుద్యోగులతో మాట్లాడి వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తమ ఫుడ్ స్టాల్ ముందు ధర్నాలు, నిరసనలు చేసి తమను రోడ్డున పడేయొద్దని కుమారి ఆంటీ కుటుంబ సభ్యులు కోరారు.నిరుద్యోగులు మాత్రం నిరుద్యోగులైన మా గురించి సీఎం రేవంత్ రెడ్డికి ఒక మాట చెప్పు అక్కా అంటూ కుమారి ఆంటీకి మొర పెట్టుకున్నారు.