ఉత్తరాఖండ్ ప్రసిద్ద గోరఖల్ ఆలయంలోకి చిరుత ప్రవేశించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే భక్తులు లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఆలయ కమిటీ స్పందించింది.
Viral News: ఆలయంలోకి చిరుత ప్రవేశంచడంతో స్థానికంగా ప్రజలు, భక్తులు భయబ్రాంతులకు లోనయ్యారు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్లో ఉన్న ప్రసిద్ధ గోరఖల్ ఆలయంలో ఈ ఘటన జరిగింది. టెంపుల్‌లోకి ప్రవేశించిన చిరుత తాపిగా చెక్కర్లు కొట్టింది. కాసేపు సరదాగా అలా తిరిగి వచ్చిన దారినే వెళ్లిపోయింది. అదేంటి వచ్చిన చిరుత ఎవరిని గాయపరుచకుండా వెళ్లడం ఏంటని ఆశ్చర్యపోకండి ఎందుకంటే అది గుడిలోకి వచ్చినప్పుడు సమయం ఉదయం 3. 40 గంటలు అవుతుంది. సీసీ కెమెరాలో ఈ విజువల్స్ రికార్డు అయ్యయి.
ఆలయ కాంప్లెక్స్‌లో గేటులేని ప్రదేశం నుంచి లోపలికి వచ్చిన చిరుత కాసేపు అక్కడే ఉండి ఆపై వచ్చిన దారినే వెళ్లిపోయింది. ఉదయం సీసీ ఫుటేజ్ చూసిన ఆలయ యాజమాన్యం ఈ విషయాన్ని పోలీసులకు, అటవిశాఖ అధికారులకు తెలిపారు. భక్తులకు ఏలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్కువయ్యాయి. ఈ నెల 21న హర్యానాలోని హిసార్ జిల్లాలో ఓ నివాస ప్రాంతంలోకి చిరుత ప్రవేశించి ఇద్దరు వ్యక్తులపై దాడిచేసింది. సమాచారం తెలుసుకున్న అధికారులు ఎంతో కష్టపడి దాన్ని బంధించారు.