ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఓ రిపోర్టర్ జగన్ గురించి షర్మిలను ప్రశ్నించగా.. ఆమె మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
YS Sharmila: ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో జగన్ విజయంలో కీలకపాత్ర పోషించిన షర్మిల.. మారిన పరిస్థితుల వల్ల ఈసారి జగన్కు వ్యతిరేకంగా పోటీచేసేందుకు షర్మిల రెడీ అయ్యారు. వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి, ఆ పార్టీలో చేరారు. ఆంధ్రప్ర్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు షర్మిల సీఎం జగన్పై విమర్శల వర్షం కురిపిస్తోంది. దీంతో వైసీపీ నేతలు రంగంలోకి దిగి.. ఆమెకు ధీటుగా కౌంటర్లు వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఓ రిపోర్టర్ జగన్ గురించి షర్మిలను ప్రశ్నించగా.. జగనన్న అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఏపీ ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టడం తప్పు కదా.. అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
నాకు జగనన్న అంటే చాలా ఇష్టం.. కానీ ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడం తప్పు – వైఎస్ షర్మిల pic.twitter.com/6u1gO3rSwO