NTR And Charan Fans రచ్చ రచ్చ.. ఆస్కార్ వేదిక పై మావాడే గ్రేట్ అంటూ…!
NTR And Charan Fans : సోషల్ మీడియాలో చరణ్, తారక్ ఫ్యాన్స్ రచ్చ చేయడం మామూలే. అయితే ఆస్కార్ అందుకున్న సమయంలోను మనోళ్లు తగ్గేదేలే అంటున్నారు. ఓ వైపు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్ కొట్టేయడంతో.. యావత్ దేశం మొత్తం సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉంది.
సోషల్ మీడియాలో చరణ్, తారక్ ఫ్యాన్స్ రచ్చ చేయడం మామూలే. అయితే ఆస్కార్ అందుకున్న సమయంలోను మనోళ్లు తగ్గేదేలే అంటున్నారు. ఓ వైపు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్ కొట్టేయడంతో.. యావత్ దేశం మొత్తం సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉంది. కానీ మెగా, నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఆస్కార్‌లో మా హీరో హైలెట్‌గా నిలిచాడంటూ.. హంగామా చేస్తున్నారు. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఆస్కార్ వేడుకలో ట్రిపుల్ ఆర్ టీం అంతా సందడి చేసింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ బ్లాక్ కలర్ సూట్లో, మన వాళ్లకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. కానీ ఆస్కార్ ప్రజెంటేషన్ సమయంలో ఎన్టీఆర్ హైలెట్ అయ్యాడని నందమూరి ఫ్యాన్స్, కాదు చరణే హైలెట్‌గా అని మెగా ఫ్యాన్స్.. కొన్ని స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ అనౌన్స్మెంట్ సమయంలో.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్స్ దక్కించుకున్న ఐదు పాటలను బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్‌లో చూపించారు. అప్పుడు చరణ్ ఫోటో మాత్రమే కనిపించింది. అయినా కూడా ఎన్టీఆరే హైలెట్ అంటున్నారు యంగ్ టైగర్ అభిమానులు. కీరవాణి, చంద్రబోస్.. వేదికపై ఆస్కార్ అవార్డు అందుకుంటున్న సమయంలో.. బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ పై కేవలం ఎన్టీఆర్ ఫోటో మాత్రమే వేశారు. ఇదే ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. ఆస్కార్ నిర్వాహకులు ఎన్టీఆర్‌ను మాత్రమే హైలైట్ చేశారంటూ.. ఆ ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు. కానీ ఆస్కార్ అనౌన్స్మెంట్ సమయంలో ఎన్టీఆర్, చరణ్ పక్క పక్కనే ఉండి.. ఆ ప్రౌడ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేశారు. ఆ విజువల్స్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయినా ఫ్యాన్స్ మాత్రం మా వాడు గొప్పంటే, మావాడు గొప్ప అంటూ రచ్చ చేస్తున్నారు. అయినా కూడా ఈ క్రెడిట్ మొత్తం దర్శక ధీరుడు రాజమౌళికే సొంతం అని చెప్పాలి.