Allu Arjun : ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీంపై ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ప్రశంసల జల్లు కురిపించారు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం కాస్త లేటుగా రియాక్ట్ అయ్యాడు.
ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీంపై ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ప్రశంసల జల్లు కురిపించారు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం కాస్త లేటుగా రియాక్ట్ అయ్యాడు. దీని పై చాలా మంది అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎంత బిజీగా ఉన్న.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ పై స్పందించక పోవడం ఏంటనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఫైనల్‌గా బన్నీ కూడా ట్రిపుల్ ఆర్ టీం పై ప్రశంసలు కురిపించాడు. బిగ్ మూమెంట్ ఫర్ ఇండియా.. ఆస్కార్ వేదికపై మన తెలుగు పాటని ఒక ఊపు ఊపినందుకు చాలా గర్వంగా ఉందంటూ.. ట్రిపుల్ ఆర్ టీమ్‌ను అభినందించాడు. అలాగే గ్లోబల్ స్టార్స్.. నా లవ్లీ బ్రదర్ రామ్ చరణ్, తెలుగు ప్రైడ్ ఎన్టీఆర్.. తమ స్టెప్పులతో ప్రపంచం మొత్తాన్ని షేక్ చేశారు అంటూ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలిపాడు. ఇది భారతదేశ సినిమా చరిత్రకే హార్ట్ టచింగ్ మూమెంట్ అంటూ అల్లు అర్జున్ తన ట్వీట్లో చెప్పారు. ఇదే ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌కు మండి పడేలా చేసిందంటున్నారు. ఈ మధ్య మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య షోషల్ మీడియా వార్ కామన్‌గా మారిపోయింది. ఇక ఇప్పుడు బన్నీ ట్వీట్ చూసి మరింత మండిపడుతున్నారు. ఎన్టీఆర్ ఏమో తెలుగు ప్రైడ్.. చరణ్‌ను మాత్రం లవ్లీ బ్రదర్ అంటు సరిపెట్టాడంటూ.. బన్ని పై ఫైర్ అవుతున్నారు మెగాభిమానులు. ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్ అయితే.. రామ్‌చరణ్ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కావాలనే చరణ్‌ను తక్కువ చేసేలా బన్నీ ఈ ట్వీట్ చేశాడని కొందరంటున్నారు. మరోసారి అల్లు మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి అంటూ కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తూ.. బన్నీ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తున్నారు. మొత్తంగా.. ఈ విషయంలో చరణ్ ఫ్యాన్స్ కాస్త ఘాటుగానే రిప్లే ఇస్తున్నారు.