Manchu Lakshmi : మంచు సోదరుల వివాదం, మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే..!
Manchu Lakshmi : మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలున్నాయంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ గొడవల కారణంగానే కుటుంబం నుంచి విడిపోయి మనోజ్ వేరుగా ఉంటున్నారు అని గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మనోజ్ దగ్గర పని చేసే సారథి అనే వ్యక్తి ఇంటికెళ్లి మంచు విష్ణు గొడవపడడంతో నిజమే అని క్లారిటీ ఇచ్చినట్టు అయింది.
మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలున్నాయంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ గొడవల కారణంగానే కుటుంబం నుంచి విడిపోయి మనోజ్ వేరుగా ఉంటున్నారు అని గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మనోజ్ దగ్గర పని చేసే సారథి అనే వ్యక్తి ఇంటికెళ్లి మంచు విష్ణు గొడవపడడంతో నిజమే అని క్లారిటీ ఇచ్చినట్టు అయింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో స్వయంగా మనోజ్ షేర్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. మంచు బ్రదర్స్ మధ్య గొడవలకు ఇదే సాక్ష్యం అంటూ నెటిజన్లు కూడా వీడియోని షేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మంచు సోదరుల వివాదంపై మంచు లక్ష్మి స్పందిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. నిజానికి ప్రస్తుతానికి మోహన్ బాబు అందుబాటులో లేకపోవడంతో ఈ విషయాన్ని మంచు లక్ష్మి హ్యాండిల్ చేస్తోందని అంటున్నారు. అయితే, ఇద్దరి మధ్య జరిగిన విషయం గురించి తనకింకా తెలియదని, పూర్తి వివరాలు తెలుసుకుని ఈ విషయం గురించి మాట్లాడతానని మంచు లక్ష్మి ఒక మీడియా ఛానల్ కు తెలిపింది.
అసలు ఏమి జరిగిందో విషయం తెలియకుండా వార్తల్ని స్ప్రెడ్ చేయడం సరికాదన్న ఆమె అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుని తర్వాత మాట్లాడతానని వెల్లడించారు.