»Man Wills Property Worth %e2%82%b9 1 5 Crore To Up Government He Has 5 Children
Viral News : పిల్లలు పట్టించుకోవడం లేదని.. ఓ తండ్రి తన ఆస్తిని ఏం చేశాడంటే..
Viral News : తల్లిదండ్రులు తమ పిల్లలను చాలా అపురూపంగా పెంచుకుంటారు. వారు అడిగింది వెంటనే తెచ్చిపెట్టేస్తూ ఉంటారు. అలాంటిది పిల్లలు.. తల్లింద్రులు వృద్ధాప్యానికి చేరుకోగానే పట్టించుకోవడం మానేస్తారు. తాజాగా ఓ తండ్రి విషయంలో అదే జరిగింది. పిల్లలు పట్టిటంచుకోలేదు. దీంతో బాధపడిన ఆయన తన ఆస్తిని పిల్లలకు కాకుండా... ప్రభుత్వానికి రాసిచ్చాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా..... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తల్లిదండ్రులు తమ పిల్లలను చాలా అపురూపంగా పెంచుకుంటారు. వారు అడిగింది వెంటనే తెచ్చిపెట్టేస్తూ ఉంటారు. అలాంటిది పిల్లలు.. తల్లింద్రులు వృద్ధాప్యానికి చేరుకోగానే పట్టించుకోవడం మానేస్తారు. తాజాగా ఓ తండ్రి విషయంలో అదే జరిగింది. పిల్లలు పట్టిటంచుకోలేదు. దీంతో బాధపడిన ఆయన తన ఆస్తిని పిల్లలకు కాకుండా… ప్రభుత్వానికి రాసిచ్చాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా….. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముజఫర్నగర్ జిల్లాలోని బిరాల్ గ్రామానికి చెందిన రైతు నాథు సింగ్ (80)కు నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉండగా.. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. భార్య కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో నాథు సింగ్.. కొడుకు వద్దే ఉంటున్నాడు. అయితే, కొడుకు, కోడలు తన పట్ల ప్రవర్తించిన తీరుతో కలత చెందిన ఆయన.. తన ఆస్తికి వారసులుగా ఉండటానికి పిల్లలు అనర్హులని భావించారు. దీంతో కోటిన్నర విలువైన స్థిరాస్తులను గవర్నర్ పేరున బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాడు.
తన మరణానంతరం ఆ భూమిలో పాఠశాల లేదా ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మించాలని కోరుతూ యూపీ గవర్నర్కు అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉంటోన్న నాథు సింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘ఈ వయసులో నేను నా కొడుకు, కోడలుతో కలిసి ఉండాల్సింది కానీ వారు నన్ను సరిగా చూసుకోవడంలేదు.. అందుకే ఆస్తిని సక్రమంగా వినియోగించుకునేలా గవర్నర్కు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపాడు.