Viral Video : దోశను ఇలా కూడా తయారు చేస్తారా? ఈ వీడియో చూస్తే అవాక్కవడం ఖాయం
ఒక చిన్న గిన్నెలో దోశ పిండి తీసుకొని పేనం మీద పిండి వేసి గిన్నెతో గుండ్రంగా వేస్తారు. ఎక్కడైనా అంతే కదా. ఇంట్లో అయినా.. హోటల్ లో అయినా ఇంకెక్కడైనా ఇలాగే చేస్తారు. కానీ.. ఓ స్ట్రీట్ వెండర్ మాత్రం..
Viral Video : దోశను ఎలా తయారు చేస్తారో తెలుసు కదా. గుండ్రంగా తయారు చేస్తారు. పేనం కొంచెం వేడి కాగానే.. ఒక చిన్న గిన్నెలో దోశ పిండి తీసుకొని పేనం మీద పిండి వేసి గిన్నెతో గుండ్రంగా వేస్తారు. ఎక్కడైనా అంతే కదా. ఇంట్లో అయినా.. హోటల్ లో అయినా ఇంకెక్కడైనా ఇలాగే చేస్తారు. కానీ.. ఓ స్ట్రీట్ వెండర్ మాత్రం.. దోశను వెరైటీగా చేశాడు. ఎంత వెరైటీ అంటే.. ఒక బొమ్మలా దాన్ని తయారు చేశాడు.
దాన్ని చూసి నెటిజన్లు మాత్రం అవాక్కవుతున్నారు. దానికి సంబంధించిన వీడియోను నాంది ఫౌండేషన్ సీఈవో మనోజ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దోశ పిండిని పేనం మీద వేసి ఒక బొమ్మగా దోశను వేశాడు. అది ఒక పిల్లి బొమ్మలా ఉంది. పిల్లి తల, ముక్కు, చెవులు అన్నీ ఉండేలా దోశను వేసి అతడు శెభాష్ అనిపించుకున్నాడు.
Viral Video : వీళ్లలో ఇంత టాలెంట్ ఉంటుందా?
స్ట్రీట్ వెండర్స్ అంటే చాలామంది చులకనగా చూస్తారు. కానీ.. వాళ్లలో కూడా టాలెంట్ ఉంటుంది. అవకాశాలు లేక.. ఆర్థిక పరిస్థితుల వల్ల రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్స్ పెట్టుకొని తమ జీవనాన్ని వెళ్లదీస్తుంటారు.. వీళ్లలో ఉన్న టాలెంట్ ను బయటికి తీస్తే ఇలా అందరికీ వాళ్ల టాలెంట్ తెలుస్తుంది అని నెటిజన్లు ఆ వీడియోను చూసి కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఆ వీడియో మాత్రం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అతడిలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు. అతడిని ప్రోత్సహిస్తే మంచి ఆర్టిస్ట్ అవుతాడు అని నెటిజన్లు పొగుడుతున్నారు.
I believe India’s street food vendors are the most innovative, resilient and impactful food influencers. More than any gourmet chef. Been wondering how to work with them to influence a nutritive food system.