చిరతను వేటాడిన కొండముచ్చులు. ఐక్యమత్యమే మహాబలము అని ఈ బబూన్స్ మరో సారి నిరూపించాయి. ఆకలి తీర్చుకుందామని దాడి చేసిన చిరత బతుకు జీవుడా అంటూ పరుగుపెట్టిన దృష్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Viral news: మందబలం చూసి కుక్కమొరిగినట్లు అనే సామెతా వినే ఉంటారు. అయితే ఇక్కడ తమ గుంపును చూసుకొని ఒక కొండముచ్చు(Baboon) ఏకంగా చిరతపు(Leopard)లిపై ఖయ్యానికి సై అంది. వెంటనే కొండముచ్చులనన్ని కలిసి చిరతపై దాడి(Attack) చేయడంతో బతుకు జీవుడా అంటూ చిరుత పరుగు లంకించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగా వైరల్గా మారింది. ఈ ఘటన దక్షిణాఫ్రికా(SouthAfrica)లో ఓ అటవి ప్రాంతంలో చోటుచేసుకుంది. అడవి దారి గుండా ఉన్న రహదారిలో జరిగిన ఈ ఘటనను ఓ వ్యక్తి తన మొబైల్లో బంధించాడు. దాదాపు 50కి పైగా ఉన్నా బబూన్స్ సంఘటితంగా దాడిచేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. రోడ్డులో స్వల్పపాటి ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తుంది.
ముందుగా రోడ్డు మీదకు వచ్చిన కొండముచ్చు(Baboons)లు ఆహారం వేటలో నిమగ్నం అయి ఉన్నాయి. ఎప్పటినుంచి మాటేసి ఉందో తెలియదు కానీ ఒక చిరుతపులి తన ఆకలి తీరుతుందని కలకని ఉంటుంది. రుచికరమైన బబూన్ను వేటాడానికి అనువైన సమయం కోసం ఎదురుచూసింది. ఒక దాని వెంటపడింది. అది గమనించి మొదట అన్ని పరిగెత్తామయి. ఒక పంజ విసెరే సమయంలో గుంపులోనుంచి మరొక పెద్ద కొండముచ్చు దానితో తలపడింది. ఆ వెంటనే ఇంకొన్ని జత అయ్యాయి. అన్ని గుంపుగా చిరతపై దాడి చేసి కరిచాయి. ఉపరి సలపనీయకుండా బబూన్స్ గుమిగూడడంతో చిరుత చేసేది ఏమిలేక అక్కడి నుంచి తన ప్రాణాలు దక్కితే చాలు అన్నట్లు పరుగులు పెట్టింది. కొద్ది దూరం దాన్ని వెంబడించాయి. అప్పటికే చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. రొడ్డుపై వాహానాలు నిలిపి ప్రయాణికులు ఈ దృష్యాన్ని చూస్తున్నారు.