తన కిరాణా షాపులో దొంగతనానికి వచ్చిన నల్లజాతీయ దొంగను (Thief) సిక్కు అయిన ఓ ఎన్నారై (NRI) చావచితక కొట్టిన వీడియో (Video) ప్రస్తుతం నెట్టింట వైరల్గా (Viral) మారింది. కాలిఫోర్నియాలోని ఓ సెవెన్ ఎలెవన్ లో ఈ ఘటన జరిగింది. వద్దంటూ పలుమార్లు వారించినా దొంగ వినకుండా కత్తితో బెదిరించడంతో ఎన్నారై అతన్ని చావచితకబాదాడు. ఎన్నారై చేసిన పనికి నెట్టింట ప్రశంస వర్షం కురుస్తోంది. ఇన్ స్టంట్ జస్టిస్ దక్కిందంటూ నెటిజన్లు షాప్ యజమానిని కొనియాడారు.
కాలిఫోర్నియా (California)లోని ఓ సిక్కు ఎన్నారై (Sikh Nri)కి చెందిన 7-ఎలెవెన్ దుకాణంలోకి (7-Eleven store) చొరబడిన ఓ వ్యక్తి దుకాణంలోని వీలైనన్ని ఎక్కువ ఉత్పత్తులను తన వెంట తెచ్చుకున్న పెద్ద చెత్త కుండీలోకి నింపుకుంటూ కనిపించాడు. అడ్డొచ్చిన దుకాణం యజమానిని కత్తితో బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో దొంగ జోలికి వెళ్లొద్దంటూ షాపులోని మరో వ్యక్తి యజమానిని హెచ్చరించాడు. అయితే, కళ్ల ముందే తన కష్టం దొంగలపాలవడంతో భరించలేకపోయాడు. ఓ పెద్ద కర్ర తీసుకొచ్చి దొంగను చావబాదాడు. ముందుగా ఆ దొంగ (Robber)ను షాపులోని వ్యక్తి అడ్డగించి కదలకుండా కిందపడేశాడు. ఆ తర్వాత యజమాని దొంగపై కర్రతో పలుమార్లు దాడి చేసి తీవ్రంగా కొట్టసాగాడు.
Sikh grocery store owner was told that "there ain't nothing you can do" repeatedly and that "ayy, just let him go" as they were being robbed. The Sikhs disagreed. pic.twitter.com/ZIb5CVLMNl