ఏ జీవికైన మరణం అనేది అత్యంత బాధకరం అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో తోటీ కోలా బీర్ చనిపోయిందని మరో కోలా బీర్ రోదించడం అందరి మనుసును కలిచివేసింది.
Viral News: జీవి ఏదైనా జననం, మరణం అనేవి ఉంటాయి. మనుషులు ఈ రెండు సందర్భలను నిర్వహిస్తారు అని తెలుసు. ఒకటి సంతోషంతో, మరోటి బాధతో అలాగే భూమి మీద ఉన్న మిగితా జంతువులు కూడా అన్ని ఇలానే జరుపుకుంటాయా అనే అనుమానం ఉంటుంది. నిజానికి జీవి పుట్టినప్పుడు సంతోషపడుతాయో లేదో తెలియదు కానీ తోటి జీవులు మరణించినప్పుడు ఏ జీవి అయినా వేదన చెందుతాయి. మాములు కోతులు, కొండముచ్చుల్లో ఈ పరిణామాలు ఎక్కువగా చూస్తాము. తాజాగా ఒక వీడియోలో కోలా అనే జీవి చనిపోయిన మరో కోలా(koala )ను ఒడిలో పెట్టుకొని ఏడుస్తుంది. ఇది చూడగానే ప్రతీ వ్యక్తి గుండె బరువెక్కుతుంది. భావోద్వేగాలు కేవలం మనుషులే కాదు జంతువులను కూడా ఉంటాయా అని ఆలోచన కలుగుతుందిి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
దక్షిణ ఆస్ట్రేలియా(South Australia)కు చెందిన కోలా రెస్క్యూ గ్రూప్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. కోలా అనేవి ఎలుగుబంటిని పోలి ఉండే జీవులు. పరిణామంలో ఎలుగుల కన్న చాలా చిన్నగా ఉంటాయి. ఎక్కువగా స్ట్రేలియాలో కనిపిస్తాయి. ఇవి పూర్తి శాకాహార జీవులు. వీడియోలో చూసినట్లైతే.. ఓ కోలా చనిపోయిన కోలాను తన ఒళ్లో పెట్టుకుని ఏడుస్తుంది. హత్తుకుని తన ప్రేమను చాటుకుంది. ఆ దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టుకున్న స్థానికులు కోలా రెస్క్యూ టీంకు సమాచారం ఇవ్వడంతో.. కోలాను రెస్క్యూ టీమ్ తమ రక్షణలోకి తీసుకున్నారు. మరణించింది ఆడ కోలా అని గుర్తించారు. మగ కోలాకు ఆరోగ్య పరీక్షలు చేసి అడవిలో వదిలేశారు.