»This Is Really Shocking The Angry Og Heroine Cut That Scene
Priyanka Mohan: ఇది నిజంగా షాకింగే.. రెచ్చిపోయిన OG హీరోయిన్, ఆ సీన్స్ కట్!
ఒకప్పుడు కాదు.. ఇప్పటికీ సౌందర్య గురించి ఎంతో గొప్పగా చెబుతారు. ఎందుకంటే.. ఏనాడు కూడా హద్దు మీరకుండా గ్లామర్ పాత్రలకు దూరంగా సినిమాలు చేసింది సౌందర్య. ఇప్పుడు కూడా అలాంటి హీరోయిన్లు ఉన్నారు. అలాంటి బ్యూటీల్లో ఒకరైనా ప్రియాంక ఆరుల్ మోహన్ గురించి ఇప్పుడో షాకింగ్ సినిమా వైరల్ అవుతోంది.
This is really shocking. The angry OG heroine, cut that scene!
Priyanka Mohan: న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ఆడియెన్స్‌కు పరిచయమైంది ప్రియాంక ఆరుల్ మోహన్. ఫస్ట్ సినిమాతోనే తెలుగు కుర్రాళ్లను కట్టి పడేసింది ఈ ముద్దుగుమ్ము. చాలా పద్దతిగా గ్లామర్‌కు దూరంగా కనిపించి హోమ్లీ బ్యూటీ అనిపించుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాల్లో కూడా ప్రియాంక చాలా పద్దతిగా కనిపించింది. దీంతో అమ్మడికి మంచి పేరు ఉంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుందని.. ఇలాంటి బ్యూటీనే తన కలల రాణిగా కుర్రాళ్లు ఊహించుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఓజి సినిమాలో నటిస్తోంది ప్రియాంగక. అలాగే నాని ‘సరిపోదా శనివారం’ సినిమాలోను నటిస్తోంది. ఈ సినిమాల్లో కూడా మంచి నిండైన పాత్రలే చేస్తోంది అమ్మడు. కానీ కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన ఓ సినిమాలో మాత్రం బోల్డ్ సీన్స్‌తో రెచ్చిపోయింది ప్రియాంక. అది కూడా బెడ్ రూమ్ సన్నివేశాలు చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్.
ప్రియాంక మోహన్ 2017లో తమిళ్లో ‘టిక్ టాక్’ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా 2023 డిసెంబర్లో రిలీజ్ అయింది. అయితే.. ఈ సినిమా నుంచి ప్రియాంక మోహన్ బోల్డ్ సీన్స్ తొలగించారని నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. డిఎస్ఆర్ ఫిల్మ్స్ ద్వారా విడుదలైన ఈ చిత్రాన్ని కాస్త లేట్‌గా చూసిన నిర్మాత.. ప్రియాంక మోహన్‌కి సంబంధించిన ముఖ్యమైన 20 నిమిషాల సన్నివేశాలను తీసేశారని ఆరోపించారు. అందుకే.. ఆ సినిమా ఫ్లాప్ అయిందని.. మూడున్నర కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని.. సినిమా పరాజయానికి DSR ఫిలింస్ కారణమని సదరు నిర్మాత ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో.. ప్రియాంక మోహన్‌తో మూడున్నర కోట్ల రూపాయలతో టిక్ టాక్ సినిమా తీశానని, ఆ తర్వాతే ఆమె ఇతర సినిమాల్లో నటించి ఫేమస్ అయ్యిందని పేర్కొన్నారు. దీంతో.. ప్రస్తుతం టిక్ టాక్ ట్రైలర్ వైరల్‌గా మారింది. అన్నట్టు.. కెరీర్ స్టార్టింగ్‌లో కాబట్టి ప్రియాంక అలాంటి సినిమా చేసి ఉండొచ్చులేండి!