Sobhita Dhulipalla: షాకింగ్.. పెళ్లి కాకుండానే తల్లి కావాలట?
స్టార్ హీరోయిన్ అంటే. ఓ మోస్తారు రేంజ్ హీరోయిన్ అనే చెప్పాలి. కానీ ప్రేమ వ్యవహారంలో మాత్రం చాలా పాపులర్ అయింది అమ్మడు. లేటెస్ట్గా ఆ హాట్ బ్యూటీ పెళ్లి కాకుండానే తల్లి కావాలనుందని చెప్పి షాక్ ఇచ్చింది.
Sobhita Dhulipalla: శోభిత ధూళిపాళ్ల గురించి ప్రస్తావన వస్తే.. ముందు నాగ చైతన్యనే గుర్తొస్తాడు. ఎందుకంటే.. సమంతతో విడిపోయిన తర్వాత చైతన్య ఈ అమ్మడితోనే లవ్‌లో ఉన్నట్టుగా ప్రచారంలో ఉంది. నాగ చైతన్య, సమంత గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా క్షణాల్లో ఎలా అయితే వైరల్‌గా మారుతుందో.. చైతన్య, శోభిత ఎఫైర్ వ్యవహారం కూడా హాట్ టాపిక్ అవుతునే ఉంటుంది. సమంతతో విడిపోయిన తర్వాత.. చైతన్య ఈ మాజీ మిస్ ఇండియాతో డేటింగ్లో ఉన్నట్టు గత కొంత కాలంగా వార్తలు వస్తునే ఉన్నాయి. ఆ మధ్యలో ఇద్దరు కలసి విదేశాల్లో షికారు చేస్తున్న ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయినా ఇప్పటి వరకు దీనిపై చైతన్య గానీ, శోభిత గానీ స్పందించలేదు. కానీ శోభితతో చైతన్య సీక్రెట్‌గా ఎఫైర్ మెయింటేన్ చేస్తున్నాడనేది ఇండస్ట్రీ గుసగుస. ఇదిలా ఉంటే.. తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా పాపులర్ అయింది శోభిత. అక్కడ మంచి సినిమాలే చేస్తోంది ఈ తెలుగు బ్యూటీ.
లేటెస్ట్గా ఈ హాట్ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. పెళ్ళికి ముందే తల్లి కావాలనుందని చెప్పి షాక్ ఇచ్చింది శోభిత. ఆమె మాట్లాడుతూ.. జీవితం అనేది రెండు ఒడ్డులు ఉండే నది లాంటిది.. అందుకే ఒకే చోట ఆగిపోకుడదు. ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు చేరుకుంటూ ఉండాలి. జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా ఉండకూడదు. ప్రస్తుతం జీవితంలో నేను ఆలోచిస్తున్నది ఒక్కటే.. అది మాతృత్వం పొందాలని. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు. కానీ.. అది జరిగితే మాత్రం ఎంతో అద్భుతంగా భావిస్తాను. మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను.. ప్రజెంట్ దాని కోసమే వెయిట్ చేస్తున్నానని.. చెప్పుకొచ్చింది అమ్మడు. దీంతో శోభిత.. త్వరలోనే పెళ్లి పీఠలెక్కడం ఖాయంగా కనిపిస్తోందని.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.