మన దేశ జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. అది మన బాధ్యత కూడా. మన దేశం గురించి.. దేశానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనకు చిన్నతనం నుంచే నేర్పిస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న పిల్లలు తెలిసో తెలియక మన దేశ జెండా విషయంలో తప్పు చేస్తే సరే.. చిన్న పిల్లలు అనుకోవచ్చు. కానీ… ఓ వ్యక్తి జెండా గురించి తెలిసి కూడా.. దానిని అగౌర పరిచాడు.
మన త్రివర్ణ పతాకంతో ఏకంగా స్కూటీని క్లీన్ చేశాడు. ఏదో టవల్‌గా భావించాడో.. ఏమో.. జాతీయ జెండాతో స్కూటీని తుడిచాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో ఉత్తర ఘోండా ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి(52) తన వైట్ స్కూటీని జాతీయ జెండాతో శుభ్రం చేసుకున్నాడు. త్రివర్ణ పతాకంతో దుమ్ము దులుపుతూ కనిపించాడు. స్థానికులు ఆ దృశ్యాలను ఆ కెమెరాలో బంధించారు. దాంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.
ఇక ఆ వీడియో ఢిల్లీ పోలీసుల దృష్టికి వెళ్లింది. దాంతో పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.ఆ వ్యక్తి ఉపయోగించిన జాతీయ జెండా, స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలియజేశారు. “ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. భజన్‌పురా పోలీస్ స్టేషన్లో 1971లోని సెక్షన్-2 కింద కేసు నమోదు చేశారు.” అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు ఆ వ్యక్తి ఉపయోగించిన జెండాను.. అతని స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదని, పొరపాటున అలా చేశానని నిందితుడు చెప్పినట్టు తెలుస్తుంది.