అరవింద్ కేజ్రివాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి. అవును.. మరి ఆయన చాట్ ఎందుకు అమ్ముతాడు అంటారా? అయితే మీకు అమిగోస్ అనే సినిమా కథ చెప్పాలి. నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే సినిమా తీస్తున్నాడు తెలుసు కదా. అది డాపెల్గాంగర్ అనే కాన్సెప్ట్‌తో వస్తోంది. డాపెల్గాంగర్ అంటే ఒకే పోలికతో ఉన్న మనుషులు అన్నమాట. మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు కదా. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌ను పోలిన మనిషి ఒకరు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
చూడటానికి అచ్చం ఢిల్లీ సీఎంలా ఉన్న ఈయన పేరు ఏంటో తెలియదు కానీ.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ వ్యక్తి చాట్ అమ్ముతున్నాడు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ఎలా ఢిల్లీ ప్రజల కోసం ఉచిత సర్వీసులు, పథకాలు అందిస్తున్నారో.. ఈ అరవింద్ కూడా తక్కువ ధరకే బెస్ట్ చాట్‌ను అందిస్తున్నాడు. ఓ ఫుడ్ వ్లోగర్ అతడిని చూసి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అరె.. అచ్చం ఢిల్లీ ముఖ్యమంత్రిలా ఉన్నాడే.. అంటూ నెటిజన్లు ఆ వీడియో చూసి నోరెళ్లబెడుతున్నారు.