»Czech Influencer Drops 1 Million In Cash From Helicopter Heres Why
Viral Video: హెలికాప్టర్ నుంచి డబ్బుల వర్షం..ఎగబడ్డ జనం..ఎక్కడంటే?
చెక్ రిపబ్లిక్‌లోని నాడ్ లాబెమ్ పట్టణంలో డాలర్ల వర్షం కురిసింది. చెక్ ఇన్ఫ్లుయెన్సర్, టీవీ హోస్ట్ కమిల్ బార్టోషేక్ హెలికాఫ్టర్ ద్వారా ఈ డబ్బును కురిపించాడు. దీనికోసం భారీ ఎత్తున జనాలు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Czech influencer drops $1 million in cash from helicopter. Here's why
Viral News: బిజినెస్ మ్యాన్ సినిమా మహేష్ బాబు లక్ష్మీదేవి గాల్లో ఎగరుతుంది అనే డైలాగ్ గుర్తుందా.. ఈ వీడియో చూస్తుంటే అదే గుర్తుకు వస్తుంది. చెక్ రిపబ్లిక్‌లోని నాడ్ లాబెమ్ పట్టణంలో డబ్బుల వర్షం కురిసింది. చెక్ ఇన్ఫ్లుయెన్సర్, టీవీ హోస్ట్ కమిల్ బార్టోషేక్(Bartoshek) హెలికాఫ్టర్ ద్వారా మిలియన్ డాలర్లను కుమ్మరించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కమిల్ మొదట ఒక పోటీ నిర్వహించి అందులో విజయం సాధించిన వారికి ఆ సొమ్మును ప్రకటించాడు. తాను నటించిన వన్‌మాన్ షో(A one man show) అనే సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక కంటెస్ట్ నిర్వహించాడు. ఆ మూవీలో డబ్బులు ఎక్కడ దాచాడో తెలిపే ఓ కోడ్‌ని కనిపెట్టాల్సిందిగా కోరాడు. అందులో పాల్గొన్న వారు విఫలం అయ్యారు.
దీంతో నిరాశ చెందిన పోటీదారులు వెనుదిరిగారు. అదే సమయంలో బార్టోషేక్ అందరినీ మరో పోటీకి ఆహ్వానించాడు. అదే డబ్బులు ఎరుకోవడం. ఇంకేముంది పోటీలో పాల్గొన్న వారు సంతోషం వ్యక్తం చేశారు. అందరూ పాల్గొన్నారు. చూస్తుండగానే $1 మిలియన్ నగదు ట్రక్‌లో వేశారు. దాన్ని హెలికాఫ్టర్ సాయంతో గాల్లోకి తీసుకెళ్లి డబ్బుల వర్షం అంటే ఏంటో చూపించారు. జనాలు ఎగబడి దొరికినోడికి దొరికినంతా అన్నట్లు సొమ్ము చేసుకున్నారు. ఇదంతా రికార్డు చేసి జ్మా కజ్మిచ్ని అనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు బార్టోషేక్. ఈ సంఘటనలో ఎవరికి గాయాలు అవలేదని తెలిపాడు.
కజ్మా కజ్మిచ్(Kazma Kazmich)ని సోషల్ మీడియాలో ప్రముఖంగా ఉపయోగించే చెక్ ఇన్ఫ్లుయెన్సర్ కమిల్ బార్టోషేక్. తాను నిర్వహించిన పోటీలో పాల్గొన్న వ్యక్తులకు బహుమతులు ఇచ్చే అసాధారణ మార్గాన్ని కనుగొన్నాడు. అతను భారీ మైదానంలో సేకరించడానికి పాల్గొనేవారిని ఆహ్వానించాడు. హెలికాప్టర్ నుంచి $1 మిలియన్ నగదును వదులుకున్నాడు. ఈ సంఘటన మొత్తాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.