వెబ్ సిరీస్, టీవీ షోలతో బిజీగా ఉన్నారు నిత్యామీనన్. స్కైలాబ్ అనే మూవీని నిర్మించారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించారు. పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టంచేశారు. తనను చేసుకునే వాడికి ఇలాంటి అర్హతలు ఉండాలని చెబుతున్నారు.
Nithya Menon: నిత్యామీనన్ (Nithya Menon).. కేరళ కుటి, నటనకు అవకాశం ఉన్న పాత్రలే చేస్తుంటుంది. ఇప్పుడు సినిమాలు అంతగా చేయకున్నా.. వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. కథ విని, స్కోప్ ఉంటేనే చేసి.. మరింత మంచి పేరు తెచ్చుకుంటున్నారు. పెళ్లిపై ఎప్పుడూ సమాధానం దాటవేస్తూ ఉండేది. ఇప్పుడు రియాక్ట్ అయ్యింది. అలా ఆలోచించే వ్యక్తి దొరికితే చేసుకుంటా అని స్పష్టంచేసింది.
ఆచారాలు, సంప్రాయాలను గౌరవిస్తానని నిత్యా మీనన్ (Nithya Menon) అంటున్నారు. పెళ్లి విషయంలో మంచి అభిప్రాయం ఉందన్నారు. పెళ్లి అనేది సాంఘీక, ఆర్థిక భద్రతతో ముడిపడి ఉంది.. తనకు అలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. దానికి మించి ఆలోచించేవాళ్లు దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశారు. అంటే కులం, మతం.. ఆర్థిక అంశాల ఎవరూ ఆలోచించరో వారిని పెళ్లి చేసుకుంటానని నిత్యామీనన్ తేల్చిచెప్పారు. తనను తనలా ఇష్టపడేవాడిని, డబ్బుకు విలువ ఇవ్వని వాడిని చేసుకుంటా అని చెప్పేశారు. మరి అలాంటి వాడు ఎక్కడ ఉన్నాడో.. ఎప్పుడూ నిత్యతో జతకలుస్తారో చూడాలీ.
వెబ్ సిరీస్, టీవీ షోలో కూడా నిత్య నటిస్తున్నారు. బ్రీత్: ఇన్ టు ద షాడోస్, మోడర్న్ లవ్ ఇన్ హైదరాబాద్ వెబ్ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ఇండియన్ ఐడల్ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. స్కైలాబ్ అనే మూవీని నిర్మించారు. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్ కూడా ప్రారంభించారు. కుమారి శ్రీమతి సిరీస్ ఆకట్టుకుంది. త్వరలో మాస్టర్ పీస్ సిరీస్ కూడా రానుంది.