»Chandigarh Driver Punches Slaps Abuses 3 Women After Nearly Hitting Their Car Viral Video
Viral: రాంగ్ సైడ్ డ్రైవింగ్ వివాదం.. రోడ్డుపై మహిళల డిష్యూం డిష్యూం
చండీగఢ్‌లో ముగ్గురు మహిళల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రోడ్ రేజ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనే వివాదంలో ముగ్గురు మహిళలు ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు తీవ్రంగా కొట్టారు.
Viral: చండీగఢ్‌లో ముగ్గురు మహిళల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రోడ్ రేజ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనే వివాదంలో ముగ్గురు మహిళలు ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు తీవ్రంగా కొట్టారు. తర్వాత విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది. చండీగఢ్‌లో గల సెక్టార్ 34 లో జరిగింది. ఓ యువతి రాంగ్ సైడ్ నుంచి డ్రైవింగ్ చేస్తుండగా ప్రజలు అడ్డుకున్నారు. యువతి ఎంత చెప్పినా వినకపోవడంతో కారును ఢీకొట్టింది. టాక్సీలో వెళుతుండగా, ఇద్దరు మహిళలు అమ్మాయిని అడ్డుకున్నారు.
విషయంపై అమ్మాయి ఆగ్రహం ఆకాశానికి చేరింది. ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో మహిళ ఇద్దరు మహిళలను తన్నడం, కొట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతీకారంగా, మహిళలు కూడా అమ్మాయిని కొట్టారు. ఆమె జుట్టు కూడా లాగడం కనిపిస్తుంది. ట్యాక్సీ డ్రైవర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి యువతి వాహనం రాంగ్ సైడ్ నడుపుతోందని చెప్పాడు. ఈ క్రమంలో ట్యాక్సీలో ఉన్న ఇద్దరు మహిళలపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఈ ముగ్గురు మహిళలను సెక్టార్ 34 పోలీస్ స్టేషన్‌కు తరలించగా అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత ముగ్గురు మహిళలు రాజీ పడ్డారు.