Bus Top: ఆర్టీసీ బస్సులో (rtc bus) ప్రయాణం చేయండి, సురక్షిత, సుఖవంతం అంటూ ఆయా రాష్ట్రాలు ప్రచారం చేస్తాయి. కొన్ని ఘటనలు చూస్తే ప్రయాణికులు బెంబేలెత్తిపోవడం ఖాయం. మహారాష్ట్రలో అలాంటి ఘటనే జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు (rtc bus) వేగంగా వెళుతోంది. ఏమైందో తెలియదు కానీ.. ఆ బస్సు టాప్ లేచింది. ప్రయాణికులు మొత్తుకుంటున్నా.. ఆ డ్రైవర్ మాత్రం వినిపించుకోవడం లేదు. బస్సును పోనిచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది.
గడ్చిరోలిలో బస్సు (bus) ప్రయాణిస్తోంది. ట్రావెల్ చేసే సమయంలోనే బస్సు రూఫ్ లేచింది. అయినప్పటికీ ఆ డ్రైవర్ కేర్ చేయలేదు. బస్సు ఆపమని ప్రయాణికులు కోరినప్పటికీ పట్టించుకోలేదు. అలాగే బస్సు పోనిచ్చాడు. దీంతో ప్యాసెంజర్స్ కేకలు పెట్టారు. 19 సెకన్ల నిడివి గల వీడియోలో ప్రయాణికుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.
టాప్ లేచి పోయినా బస్సును ఆపలేదు
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఒక అర్టిసి బస్సు రూఫ్ రన్నింగ్ లోనే లేచి పోయింది, అందులో ప్రయాణికులు అర్థనాదాలు చేసినా డ్రైవర్ అలాగే బస్సుని నడిపాడు, దీంతో అధికారులు ఆ డ్రైవర్ పై చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు.#Maharashtra#MaharashtraBuspic.twitter.com/eJpwfBokrX
ఈ ఘటనను ఆర్టీసీ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. సదరు డ్రైవర్‌పై చర్యలకు ఉపక్రమించారు. బస్సు టాప్ లేచినప్పటికీ.. ఎందుకు నడిపారో తెలియజేయాలని కోరారు. ఆ డ్రైవర్ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ఆగ్రహాం వ్యక్తం అవుతోంది. అసలే వర్షాలు కురుస్తున్నాయని.. ఈ సమయంలో టాప్ లేచినప్పటికీ బస్సు తీసుకెళ్లడం ఏంటీ అని మండిపడుతున్నారు.