»Bride Died With Heart Attack In Gujarat Bhavnagar District
Gujarat: పెళ్లవుతున్న ఆనందంలో వధువుకి గుండెపోటు.. చెల్లితో వరుడికి వివాహం
భారీ శబ్ధాలు భరించలేక హేతల్ గుండెపోటుకు గురై ఉంటుందని తెలుస్తున్నది. భారీ శబ్ధాలను తట్టుకోలేక గుండెపోటు వచ్చి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అందుకే శుభకార్యాల్లో డీజేను నిషేధిస్తున్నారు. సున్నితమైన వారు ఈ భారీ శబ్దాలను తట్టుకోలేక ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఆనందం.. సంతోషం వస్తే ఎగిరి గంతులేస్తాం.. బాధ వస్తే కుంగిపోతాం. ఏది జరిగినా అది హృదయం (Heart) నుంచే జరగాల్సి ఉంది. గుండె ద్వారా భావోద్వేగాలు పెరుగుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో గుండె వీటిని తట్టుకోలేకపోతున్నది. అతిగా ఆనందం వేసినా.. బాధ వేసినా గుండె తట్టుకోలేక ఆగిపోతున్నది. ఇటీవల వరుసగా గుండెపోటు (Heart Attack)లకు గురై మృతి చెందుతున్న వారి విషయంలో జరుగుతున్నది ఇదే. హైదరాబాద్ లో జిమ్ చేస్తూ కానిస్టేబుల్ ధరమ్ విశాల్ ఆకస్మిక మృతి మరువకముందే మరో సంఘటన అలాంటిదే జరిగింది. తనకు కాబోయే భర్త (Fiancy) వచ్చాడనే ఆనందంలో ఉన్న పెళ్లి కూతురు (Bride) ఆ ఆనందంలోనే గుండెపోటుకు గురై మృతి చెందింది. ఈ సంఘటన దిగ్భ్రాంతి కలిగించగా.. కుటుంబసభ్యులు చేసిన పని మరింత షాక్ కు గురి చేసింది. కుమార్తె చనిపోవడంతో వరుడికి ఆమె చెల్లెలును ఇచ్చి వివాహం చేశారు. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.
గుజరాత్ (Gujarat)లోని భావ్ నగర్ జిల్లా (BhavNagar District) సుభాశ్ నగర్ కు చెందిన జినాభాయ్ రాఠోడ్ పెద్ద కుమార్తె హేతల్ (Hetal)కు నారీ గ్రామానికి చెందిన విశాల్ భాయ్ (Vishal Bhai)తో వివాహం నిశ్చయించారు. ఫిబ్రవరి 23వ తేదీన గురువారం వీరి వివాహం జరుగాల్సి ఉండగా.. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక వరుడు ఊరేగింపుగా సందడి వాతావరణంలో పెళ్లి కుమార్తె ఇంటికి వచ్చాడు. అయితే తనకు కొన్ని గంటల్లోనే పెళ్లవుతున్న ఆనందంలో హేతల్ ఉబ్బితబ్బిబైంది. ఈ ఆనందం తట్టుకోలేకపోవడంతో ఆమెకు అకస్మాత్తుగా స్పృహ తప్ప పడిపోయింది. ఈ పరిణామంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే హేతల్ మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లి జరుగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది.
అయితే ఈ సమయంలో కుటుంబసభ్యులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పెద్ద కుమార్తె చనిపోవడంతో ఆమె స్థానంలో తమ చిన్న కూతురును ఇచ్చి వరుడికి వివాహం జరిపించారు. తమ కుమార్తెను ఇవ్వలేకపోయాం ఆమె చెల్లెను ఇచ్చి విశాల్ తో వివాహం చేయించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హేతల్ మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచి విశాల్ తో ఆమెకు పెళ్లి చేశారు. ఆనందోత్సాహాలతో జరుగాల్సిన పెళ్లి అందరి కన్నీటి సుడిలో జరిగింది. వివాహం అనంతరం హేతల్ మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. అయితే హేతల్ మృతికి కారణాలు ఏమిటనేది తెలియడం లేదు. భర్త వచ్చే సమయంలో అధిక సౌండ్ లతో డీజే పెట్టి ఊరేగింపుగా వచ్చాడు. భారీ శబ్ధాలు భరించలేక హేతల్ గుండెపోటుకు గురై ఉంటుందని తెలుస్తున్నది. భారీ శబ్ధాలను తట్టుకోలేక గుండెపోటు వచ్చి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అందుకే శుభకార్యాల్లో డీజేను నిషేధిస్తున్నారు. సున్నితమైన వారు ఈ భారీ శబ్దాలను తట్టుకోలేక ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.