»Atrocity Happened In Australia Indian Student Jasmine Kaur Was Murdered By Her Ex Boyfriend Tarak Jok Singh
Australia: మాజీ ప్రియుడి చేతిలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య
కళ్లకు గంతలు కట్టి, శరీరాన్ని కేబుళ్లతో చుట్టేసి, గొంతు కోసి బతికుండాగానే పాతికేళ్లు కూడా లేని భారతీయ యువతిని ఆస్ట్రేలియాలో తన మాజీ ప్రియుడు గోతిలో పాతి పెట్టాడు. ఈ ఘటన విషయాలు ఇటివల వెలుగులోకి వచ్చాయి.
ఉన్నత చదువులకోసం వెళ్లిన భారతీయ విద్యార్థిని ఆస్ట్రేలియాలో( Australia) దారుణ హత్యకు గురైంది. తన మాజీ ప్రియుడే అతి కిరాతకంగా కక్ష కట్టి చంపేశాడు. తనను దూరం పెట్టిందన్న పగతో ఆమెను అపహరించి కళ్లకు గంతలు కట్టి, కేబుళ్లతో శరీరాన్ని మొత్తం చుట్టేసి, సజీవంగా గోతిలో పాతిపెట్టాడు. నరయాకతన అనుభవించిన ఆమె ప్రాణాలు వదిలింది. 2021లో జరిగిన ఈ అమానవీయ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు బయటకొచ్చాయి. ఈ కేసు విచారణలో భాగంగా వెల్లడైన అన్ని వివరాలను ప్రాసిక్యూటర్ బుధవారం కోర్టు(Court)కు అప్పగించారు. వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన జాస్మిన్ కౌర్ (Jasmine Kaur) అనే 21 ఏళ్ల యువతి ఆస్ట్రేలియాలో నర్సింగ్ కోర్స్ చదవడానికి వెళ్లింది. అక్కడ తారిక్ జోత్ సింగ్(Tarik Jok Singh) అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారి స్నేహం కొన్నాళ్లకు ప్రేమకు దారితీసింది.
కొంతకాలం ప్రేమలో ఉన్న వారు ఆ తర్వాత తారిక్‌జోత్ సింగ్ ప్రవర్తనలో మార్పును గమనించిన జాస్మిన్.. అతడిని దూరంపెట్టింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయిన తారిక్ జాస్మిన్ చంపి ప్రతీకారం(revenge) తీర్చుకోవాలనుకున్నాడు. పథకం ప్రకారం 2021 మార్చి 5న ఆమెను నార్త్ పాలింప్టన్ ప్రాంతం నుంచి కిడ్నాప్ చేశాడు. కళ్లకు గంతలు కట్టి, కేబుళ్లతో శరీరాన్ని చుట్టేసి, కారు డిక్కీలో 640 కి.మీ. దూరంలో సిటీ ఔట్ స్కట్స్ ప్రాంతంలో ఉన్న ఫ్లిండర్స్ రేంజెస్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. కత్తితో గొంతు కోసి ప్రాణం ఉండగానే గోతిలో పాతి పెట్టాడు. కిడ్నాప్ అయిన సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను సేకరించిన పోలీసులు.. జాస్మిన్ను హత్య చేసింది తారికేనని నిర్ధారణకు చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి నెలలో కోర్టులో తారిక్ తాన చేసిన నేరాన్ని అంగీకరించాడు. జాస్మిన్ పాతిపెట్టిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించాడు. అక్కడ నుంచి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం చేయాగా.. ఈ నివేదికలో అతడు ఎంత ఘోరంగా జాస్మీన్ ను చంపాడో అధికారులు వెల్లడించారు. ఇంత పాశవికంగా విధ్యార్థిని చంపిన కారణంగా ఈ కేసులో తారిక్ జోత్ సింగ్ కు కోర్టు జీవితఖైదు విధించే అవకాశం ఉంది.