»An Afternoon Nap At This Chinese School Comes At A Cost And Not Everyone Can Bear It
Viral News: పాఠశాలలో పిల్లలు నిద్రించోచ్చు.. ప్యాకేజీని బట్టి సదుపాయం
పిల్లలు తినగానే మధ్యాహ్నం పాఠశాలల్లో నిద్రపోవడం మాములు విషయమే. దీనికోసం చైనాలోని కొన్ని స్కూల్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ప్యాకేజీలను బట్టి విద్యార్థులకు నిద్రపోయే సదుపాయాన్ని కలిపిస్తున్నారు.
An Afternoon Nap At This Chinese School Comes At A Cost And Not Everyone Can Bear It
Viral News: ధనం మూల ఇదం జగత్ అనే స్లోగన్ వినే ఉంటారు. డబ్బు(Money) ఉంటే ఏదైనా చేయొచ్చు, అన్ని సదుపాయాలు సమకూరుతాయి అనడానికి ఈ ఉదహారణ సరిపోతుంది. చైనా(China)లోని ఓ పాఠశాల డబ్బు కోసం ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. మధ్యాహ్నం పిల్లలకు నిద్రపోయే సదుపాయాన్ని కలిపిస్తూ స్లీప్ పీరియడ్(Sleep Period)ను కేటాయించింది. అయితే ఫ్రీగా మాత్రం కాదు. దీనికోసం అదనపు ఫీజు వసూళ్ చేస్తుంది. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో జీషెంగ్ ప్రాథమిక పాఠశాలలో ఈ విధానం అమలు చేస్తున్నారు. అయితే ఇది ప్రయివేట్ పాఠశాల అనేది గమనార్హం.
చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వీచాట్ యాప్‌లో ఈ వార్త వైరల్‌గా మారింది. స్కూల్ నోటీసు బోర్డుపై ఉన్న ఈ స్లీపింగ్ కాన్సెప్ట్‌కు సంబంధించిన వివరాలు ఉన్నాయి. హాంగ్ కాంగ్ కేంద్రంగా నడిచే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్(South China Morning Post) అనే మీడియా సంస్థ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. స్కూల్ నోటీసులో పేర్కొన్న వివరాలు ప్రకారం.. విద్యార్థులు మధ్యాహ్నం భోజనం అనంతరం కునుకు తీయవచ్చు. ఇందుకు మూడు రకాల ప్యాకేజీలు ఉన్నాయి. తరగతి గదిలో డెస్క్ వద్దే నిద్ర పోవాలి అనుకుంటే దానికి 200 యువాన్లు. అటే 28 డాలర్లు (రూ.2,324) చెల్లించాలి. క్లాస్ రూమ్ లో కింద మ్యాట్ పై పడుకునేట్టు అయితే అప్పుడు 360 యువాన్లు (49.29 డాలర్లు) అవుతుంది. ఇక ప్రైవేటు రూమ్ లో ఏర్పాటు చేసిన పడకలపై నిద్రించాలని కోరుకునే వారికి 680 యువాన్లను (93 డాలర్లు) చెల్లించాలి. పిల్లలు నిద్రించే సమయంలో టీచర్ల పర్యవేక్షణ ఉంటుంది. అయితే ప్రైవేటు పాఠశాలల్లో ఈ సేవలు నిర్వహించుకోవచ్చని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. అయితే పాఠశాలల్లో లంచ్ బ్రేక్ సమయంలో నిద్రంచలేని వారు ఆ సమయంలో ఇంటికి వెళ్లి రావచ్చని స్కూల్ యాజమాన్యం తెలిపింది.