»Home Guard Ravinder Tried To Commit Suicide For Lack Of Salary Critical Condition Osmania Hospital
Home Guard: జీతాలు ఇవ్వడం లేదని హోంగార్డు ఆత్మహత్యాయత్నం
తెలంగాణలో హోంగార్డ్ రవీందర్ గత రెండు నెలల నుంచి జీతాలు రావడం లేదనే బాధతో ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Home guard Ravinder tried to commit suicide for lack of salary critical condition Osmania Hospital
Home Guard: జీతాలు ఆలస్యం కావడంతో హోంగార్డు రవీందర్ ఆవేదనతో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న హోంగార్డుల జేఏసీ ఆస్పత్రికి చేరుకుని ఆయనకు మద్దతుగా నిరసన తెలుపుతున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద పరిస్థతి ఉద్రిక్తంగా మారింది.
బీసీ బంధు, దళిత బంధు, రైతు బంధు అని వేల కోట్ల రూపాయాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లలా ఖర్చుపెడుతుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగుల ఆర్తనాదాలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో చిన్న స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే అంశం కూడా ఇప్పటికీ అలానే ఉంది. ఇక పంచాయితీ కార్యదర్శులు, కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు రెండు, మూడు నెలలుగా జీతాలు పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో మధ్యతరగతి ఉద్యోగులు తీవ్ర మనస్థాపంతో ప్రాణాలమీదకు తెచ్చకుంటున్నారు. తాజాగా రవిందర్ అనే హోంగార్డు జీతాలు సమయానికి రాకపోవడం లేదనే కారణంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రాణపాయ స్థితిలో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.
పాతబస్తీ ప్రాంతంలోని ఉప్పుగూడకు చెందిన 38 ఏళ్ల ఎం.రవీందర్ చాంద్రాయణ గుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నాడు. రవీందర్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మధ్యతరగతి కుటుంబం అయిన నేపథ్యంలో జీతం రాకుంటే నెలాఖారున ఇళ్లు గడవని పరిస్థితి. దీనికి తోడు నెల ప్రారంభంలో ఈఎంఐలు ఇబ్బందులు కూడా. ఈ క్రమంలోనే ఈ నెల జీతం కూడా ఇంకా పడలేదు. దీంతో ఆయన కారణాలను తెలుసుకునేందుకు గోషామహల్ లో ఉన్న హోంగార్డు కమాండెంట్ ఆఫీసుకు మంగళవారం వెళ్లారు. జీతం ఆలస్యానికి గల కారణాలను అక్కడి సిబ్బందిని అడిగారు. చెక్కులను బ్యాంకులకు ఇప్పటికే పంపించేశామని.. ఒకటి లేదా రెండు రోజుల్లో జీతం పడుతుందని వారు బదులిచ్చారు.
దీంతో మనస్థాపం చెందిన ఆయన ఆఫీసు బయటకు వెళ్లి ఆయనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకుని నిప్పంటికున్నారు. అప్రమత్తం అయిన తోటి ఉద్యోగులు మంటలను ఆర్పీ అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే 55 శాతం కాలిన శరీరంతో ప్రస్తుతం రవిందర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల తెలిపారు. విషయం తెలుసుకున్న హోంగార్డుల జేఎసీ ఆసుపత్రి వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరిట సాధించుకున్న తెలంగాణలో ఇంకా ఆకలి చావులు ఉన్నాయంటే అది కచ్చితంగా పాలకుల వైఫల్యమే అని చెప్పవచ్చు. బంగారు తెలంగాణ పేరుతో పాలనలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలలో 10 శాతం ప్రజా సంక్షేమం మీద పెడితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలను మాయ చేసే స్కీమ్లు, ప్రతిపక్షాలను తిప్పికొట్టే పథకాలు తప్ప పేదవారు అభివృద్ధి చెందే స్కీములే లేవంటున్నారు.