సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య పోరుతో సుడాన్ దేశం(Sudancountry)లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల ఆధిపత్య పోరు ప్రజల పాలిట శాపంగా మారింది. లక్షలాది మంది సుడాన్ వాసులు వలసలు పోతున్నారు. వందలాది మంది ప్రాణాలు వదులుతున్నారు. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఆకలి చావులు(Starvation deaths)అక్కడ నిత్యకృత్యమయ్యాయి. తాజాగా సుడాన్ రాజధాని ఖార్తూమ్ (Khartoum)లోని ఓ అనాథ శరణాలయం నుంచి వెలుగులోకి వచ్చిన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. చిన్నారులకు పట్టడానికి పాలు కూడా లేకపోవడంతో మంచి నీటిని తాగిస్తున్నారు. దీంతో కనీస ఆహారం (FOOD) అందక పసికందులు అనారోగ్యానికి గురై, వైద్య సాయం అందక ప్రాణాలు కోల్పోతున్నారు.
అంతర్యుద్ధం కారణంగా సూడాన్‌లో దారుణ పరిస్థితులు (Sudan conflict) నెలకొన్నట్లు అంతర్జాతీయ సంస్థలు(International organizations) వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఘర్షణలు ప్రారంభమైన ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దాదాపు 500 మంది చిన్నారులు ఆకలితో (Hunger) ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికంగా పనిచేసే సేవ్ ది చిల్డ్రన్ (Save the Children) అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా 31వేల మంది పోషకాహార లోపంతో బాధపడుతోన్నప్పటికీ వారికి చికిత్స అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.‘చిన్నారులు ఈ స్థాయిలో ప్రాణాలు కోల్పోతారని మేం ఎన్నడూ ఊహించలేదు.
కానీ, సూడాన్‌లో నెలకొన్న పరిస్థితులు ఇవే. నిర్మూలించగలిగే ఆస్కారం ఉన్న ఆకలితో.. చిన్నారులు (little girls)చనిపోవడం కలచివేస్తోంది’ అని సేవ్ ది చిల్డ్రన్ సూడాన్ డైరెక్టర్ ఆరీఫ్ నూరీ (Arif Noori)తెలిపారు. మరోవైపు ఘర్షణల కారణంగా అనేక మందికి నీరు, విద్యుత్ సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నట్లు నివేదికలు (Reports) వెల్లడిస్తున్నాయి. ఆరోగ్య వ్యవస్థ కూడా పూర్తిగా కుప్పకూలిపోయిందని సమాచారం.ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో లక్షలాది మంది సూడాన్ వాసులు సొంత ప్రాంతాలను వీడి వలసలు పోతున్నారు. చాలా మంది సూడాన్ వీడి ఇతర దేశాలకు శరణార్థులు(Refugees)గా వెళ్తున్నారు. ఈ ఘర్షణల్లో వేలాది మంది చనిపోయినట్లు తెలుస్తోంది.