ఖైరతాబాద్ (Khairatabad) మహా గణపతికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి ఏడాది ఒక్కో రూపంలో గణనాథుడు దర్శనం ఇస్తుంటారు. ఖైరతాబాద్ గణపతి(Ganapati)ని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది శ్రీ దశమహా విద్యాగణపతి రూపంలో ఖైరతాబాద్ గణేశ్ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. గతేడాది 50 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం.. ఈ ఏడాది 63 అడుగుల్లో రూపుదిద్దుకోనుంది. నిల్చున్న తీరులో శ్రీ దశమహా విద్యాగణపతి విగ్రహం దర్శనమివ్వనుంది. ఈ నెల చివరి నాటికి భారీ విగ్రహం (A huge statue) తయారీ ఫినిషింగ్ పూర్తి కాబోతోంది.
హైదరాబాద్ (Hyderabad) లో వినాయక చవితి ఉత్సవాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ భారీ గణపతి. ప్రతి ఏటాలానే ఈసారి కూడా భారీ గణనాథుడు కొలువుదీరుతున్నాడు. ఈసారి మరింత ప్రత్యేకంగా, విభిన్నంగా ఖైరతాబాద్ గణనాథుడు దర్శనం ఇవ్వనున్నాడు. ఒకవైపు లక్ష్మీ నరసింహ స్వామి, మరొకవైపు వీరభద్ర స్వామి (Veerabhadra Swamy) ఉంటారు.ఇప్పటివరకు వినాయక విగ్రహం తయారీ పనులు 60శాతం పూర్తయ్యాయి.సెప్టెంబర్ 18వ తేదీన వినాయక చవితి ఉంటుంది. 15వ తేదీ నాటికి వినాయకుడి విగ్రహం తయారీ పూర్తవుతుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి కలర్స్ వేస్తారు. 10 రోజుల పాటు రంగులు వేస్తారు.
గతేడాది తొలిసారిగా 58 అడుగుల ఎత్తుతో మట్టి వినాయకుడిని చేశారు. ఈ ఏడాది 63 అడుగుల ఎత్తుతో మట్టి గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పర్యావరణ (Environmental) హితం కోసం మట్టి గణపతినే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్‌లో గణేశుని ఉత్సవాలు ప్రారంభమై ఈ ఏడాదితో 69 ఏళ్లు అవుతోంది. ఏటా సిద్ధాంతి విఠలశర్మ (Vithalsharma) సూచనతో నమూనా సిద్ధం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ప్రకారమే ప్రస్తుత పరిస్థితులను అనుగుణంగా ఆయన సూచనల ప్రకారం నామకరణం చేశారు.