మెగా కంపౌండ్‌లో హీరోలకు కొదవ లేదు. ఓ క్రికెట్ టీమ్‌నే ఫామ్ చేయొచ్చు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి హీరోలు వస్తూనే ఉన్నారు. మెగా అమ్మాయిలు మాత్రం ప్రొడ్యూసర్స్‌గా రాణించేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే ఒకరు నిర్మాణం రంగంలో ఉండగా.. ఇప్పుడు మెగా డాటర్ నిహారిక కూడా సినిమాలు నిర్మిస్తానని అంటోంది.
Mega Compound: మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా.. మెగా బ్రాండ్‌తో నిహారికకి మంచి పాపులారిటీ ఉంది. అప్పట్లో ఏవో సిరీస్‌లు, షార్ట్స్ ఫిల్మ్స్ , సినిమాలు కూడా చేసింది. దాంతో నిహారికకు హీరోయిన్గా తెగ ఇంట్రెస్ట్ ఉందని అంతా అనుకున్నారు. మెగా అభిమానులు ఆమెను కాస్త వ్యతిరేకించారు. మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. కానీ నిహారిక హీరోయిన్ అనేసరికి.. కాస్త భయపడ్డారు. మెగా ఫ్యాన్స్ ఏదైతే అనుకున్నారో.. అందుకు తగ్గట్టే నిహారిక సినిమాలకు దూరమైంది.. పెళ్లి కూడా చేసుకుంది. కానీ కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. అంతేకాదు ‘డెడ్ పిక్సల్స్’ అనే వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ కూడా ఇచ్చింది. అలాగే నిర్మాతగా కూడా సత్తా చాటడానికి ట్రై చేస్తోంది.
పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ మూవీస్ నిర్మిస్తోంది నిహారిక. ఈ బ్యానర్ పై ఓటీటీకి కంటెంట్ అందిస్తోంది. ఇప్పటికే జీ5కు కంటెంట్ అందించింది. ఇక ఇప్పుడు సినిమాలు కూడా నిర్మిస్తానని ప్రకటించింది. ‘పింక్ ఎలిఫెంట్ బ్యానర్ స్థాపించాను. ప్రస్తుతానికి ఓటీటీ కోసం వర్క్ చేస్తున్నాం. సోనీ లివ్కు ఓ ప్రాజెక్ట్ పూర్తిచేశాం.. త్వరలోనే అమెజాన్‌కు ఒకటి చేయబోతున్నాం. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలో ఓ సినిమా కూడా నిర్మించబోతున్నానని’ నిహారిక చెప్పుకొచ్చింది. దీంతో చిరంజీవి కూతురు సుశ్మిత దారిలో నిహారిక కూడా వెళ్తుందని చెప్పొచ్చు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సుశ్మిత సినిమాలు నిర్మిస్తోంది. మెగాస్టార్ 156 ప్రాజెక్ట్ ఈ బ్యానర్లోనే రాబోతోంది. ఇక ఇప్పుడు నిహారిక కూడా నిర్మాతరా రాణించేందుకు ట్రై చేస్తోంది.