రెండు పాములు ఇంట్లోకి దూరి… సంభోగంలో పాల్గొన్నాయి. పొరపాటున ఇంట్లోని కిచెన్ లో కి వెళ్లిన మహిళకు ఆ సంఘటన చూసి భయంతో వణికిపోయింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆస్ట్రేలియాలోని క్వీన్ లాండ్ లోని బుదేరిమ్ లోని నివాసముంటున్న ఓ మహిళ ఇంట్లోకి రెండు కొండ చిలువలు దూరాయి. కిచెన్ లో ఆ రెండు సంభోగంలో పాల్గొనడం గమనార్హం. మైక్రో ఓవెన్ పక్కన ఆ రెండు పాములో సంభోగంలో పాల్గొనడం గమనార్హం. కిచెన్ లో ఏవో వింత శబ్ధాలు రావడంతో ఆమె వెళ్లి చూసింది. అక్కడ జరుగుతున్నది చూసి ఆమె భయంతో వణికిపోయింది.
వెంటనే ఇంట్లో నుంచి బయటకు పరుగుతీసి… ఆమె స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించింది.స్నేక్ క్యాచర్స్ అక్కడకు వచ్చి.. వారు చాలా చాకచక్యంగా ఆ రెండు పాములను పట్టుకున్నారు. అవి రెండు ఆడ, మగ కొండచిలువలు అని.. కలయికలో ఉన్నాయని స్నేక్ క్యాచర్స్ అన్నారు. కాగా, గతంలోనూ బుదేరిమ్ ప్రాంతంలో పలు పైథాన్లను పట్టుకున్నామని.. ఇక్కడ జనావాసాలకు అటవీ ప్రాంతం దగ్గరలో ఉండటంతో.. పాములు, కొండచిలువలు తరచూ ఇలా ప్రజల ఇళ్లల్లోకి వస్తూ ఉంటాయి అని వారు చెప్పారు.