YS Sharmila:తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (YS Sharmila) అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ (modi), హోం మంత్రి అమిత్ షా (amith shah), సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు (supreme court) విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి లేదన్నారు.
YS Sharmila:తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (YS Sharmila) అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ (modi), హోం మంత్రి అమిత్ షా (amith shah), సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు (supreme court) విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి లేదన్నారు. ప్రజల గొంతు వినిపించినా అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అంశంపై దృష్టిసారించాలని కోరారు. సీఎం కేసీఆర్ (cm kcr) నియంత అని మరోసారి రుజువు అయ్యిందన్నారు. తనకు ఆయన భయపడుతున్నాడని చెప్పారు.
ఇచ్చిన ఒక్క వాగ్ధానం కూడా నిలబెట్టుకోలేదని షర్మిల (sharmila) విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని అనుకుని.. జనతా రైడ్‌కి పిలుపు నిచ్చామని పేర్కొన్నారు. ఈ రోజు ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ రోగుల పరిస్థితి తెలుసుకుందామని అనుకున్నానని చెప్పారు. ఇంతలో ఇంటి నుంచి తనను బయటకు రానీయలేదని అంటున్నారు. ఆస్పత్రిలో రోగులకు వైద్యం అందడం లేదని చెప్పారు. సమస్యలు ప్రత్యక్షంగా చూడాలని అనుకున్నాం అని తెలిపారు. ఒక్కరిని వస్తానని.. అనుమతి ఇవ్వాలని కోరారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని బ్రతకనివ్వడం లేదని షర్మిల (sharmila) అన్నారు. ప్రజల తరఫున పోరాడితే హౌస్ అరెస్ట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మొన్న రేవంత్ రెడ్డిని (revanth reddy) హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను (bandi sanjay) అరెస్ట్ చేశారు.. ఈ రోజు తనను అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. ప్రజల పక్షాన నిలబడటం తప్పా..? అని అడిగారు. కేసీఆర్ (kcr) ఒక డిక్టేటర్ అని మండిపడ్డారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద టవర్స్ కడతామని ఇచ్చిన హామీ ఏమైంది.. 200 కోట్లతో కడతాం అని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు.