»What Did Priyanka Gandhi Do When She Saw A Bouquet Without Flowers Mp Elections 2023
Viralvideo: ప్రియాంక గాంధీకి పూలు లేని బొకే..చూసి ఏం చేసిందంటే
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇటివల ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా ఆమెకు అరుదైన సంఘటన ఎదురైంది. వేదికపై నిలిచిన ఆమెకు పుష్పాలు లేని పుష్పగుచ్చాన్ని ఓ నేత ఇవ్వగా అది గమనించిన ఆమె పువ్వలేవని ప్రశ్నించారు. అది చూసిన అక్కడి నేతలు నవ్వుకున్నారు. దీంతోపాటు ప్రియాంక కూడా నవ్వారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
What did Priyanka Gandhi do when she saw a bouquet without flowers mp elections 2023
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. నవంబర్ 17న ఇక్కడ ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండోర్లో ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)కి ఓ వింత సంఘటన ఎదురైంది. ప్రియాంక గాంధీ సమావేశంలో భాగంగా వేదికపై ఉండగా.. ఓ కాంగ్రెస్ నేత వచ్చి పూలు లేకుండా ఉన్న పుష్పగుచ్ఛం ఆమెకు ఇచ్చారు. అది తీసుకుని చూసిన ప్రియాంక గాంధీ..అందులో పువ్వులేక్కడ అన్నట్లు సైగలు చేసింది. అంతేకాదు అది చూసిన మిగతా నాయకులు కూడా నవ్వడం మొదలుపెట్టారు. అయితే ఈ సంఘటన మొత్తం వేదికపై జరుగగా..అక్కడున్న మీడియా మొత్తం కవర్ చేసింది. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
गुलदस्ता घोटाला 😜
गुलदस्ते से गुल गायब हो गया.. दस्ता पकड़ा दिया 😂😂
मध्यप्रदेश के इंदौर में प्रियंका वाड्रा की रैली में एक कांग्रेसी गुलदस्ता देने पहुंचा लेकिन कांग्रेसी खेल हो गया।#MPElections2023pic.twitter.com/y7Qmyldp94
— राकेश त्रिपाठी Rakesh Tripathi (@rakeshbjpup) November 6, 2023
ఇక్కడ ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రెండు పార్టీలు చెబుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రెండు పార్టీల నేతలు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ వీడియోపై భారతీయ జనతా పార్టీ(BJP) అధికార ప్రతినిధి రాకేశ్ పాఠక్ ఘాటుగా స్పందించారు. అతను తన ఎక్స్ ఖాతాలో ఇలా వ్రాశారు. గుత్తి స్కామ్, పుష్పగుచ్ఛం నుంచి పువ్వు మాయమైంది. స్క్వాడ్ పట్టుబడిందన్నారు.
ఇక ఇండోర్లో జరిగిన ఈ ర్యాలీలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తూ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్లో 18 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉందన్నారు. కేంద్రంలో పదేళ్లు ఉన్నా తమ నాయకులకు ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు తమ సభల్లో కాంగ్రెస్(congress) పేరును జపిస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. 250 కుంభకోణాలు చేసి దోచుకున్న ప్రభుత్వం.. ప్రజా ధనాన్ని దోచుకోగలదని రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు.