నది(River)లో నీరు తక్కువగా ఉండటం, పైగా పల్సర్ బైక్ మునిగేంత నీరు లేకపోవడంతో ఓ యువకుడు చక్కగా డ్రైవ్ చేసుకుంటూ ఒక ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు అవలీలగా చేరుకున్నాడు. ఆ యువకుడు పల్సర్ బైక్ తో చేసిన ఆ ఫీట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
చాలా మందికి నది(River)లో ప్రయాణం అంటే భయం. నదిపై పడవ ప్రయాణం చేసేటప్పుడు కూడా కొందరు అలర్ట్ గా ఉంటారు. ఎక్కడ నదిలో పడి కొట్టుకుపోతామని కొందరు, నదిలో పడి గల్లంతవ్వకుండా ఉండాలని మరికొందరు భయాలతో ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడొక కుర్రాడు నది(River)లో పల్సర్ బైక్ తో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో అందర్నీ ఆకర్షిస్తోంది.
పల్సర్ బైక్‌తో నదిని దాటిన వీడియో:
నది(River)లో నీరు తక్కువగా ఉండటం, పైగా పల్సర్ బైక్ మునిగేంత నీరు లేకపోవడంతో ఓ యువకుడు చక్కగా డ్రైవ్ చేసుకుంటూ ఒక ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు అవలీలగా చేరుకున్నాడు. ఆ యువకుడు పల్సర్ బైక్ తో చేసిన ఆ ఫీట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
‘మోటార్ ఆక్టేన్’ అనే ఆటో మొబైల్ బ్లాగ్, యూట్యూబ్ ఛానెల్ దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోకు సంకల్పం ఉంటే మార్గం ఉంటుందని కొటేషన్ ను పెట్టడం విశేషం. అంతేకాకుండా దీని గురించి ఆలోచించండి, ఇది తెలివైనదా? లేక ప్రమాదకరమైనదా? అంటూ ప్రశ్నలు సంధించింది.
సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్న ఈ వీడియోకు ఇప్పటికే ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది నిజంగానే రిస్క్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా మరో యూజర్ మాత్రం ఇలా వెళితే ఇంజిన్ పరిస్థితి ఏం కాను అంటూ కామెంట్స్ చేశాడు. తెలివిగా డ్రైవ్ చేశాడంటూ మరో యూజర్ రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్(Video Viral) అవుతోంది.