వికారాబాద్: జిల్లా పూర్తిగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ఏర్పాటు కావడం హర్షణీయమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. వుడా ఏర్పాటు ద్వారా జిల్లాలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీల పరిధిలో రవాణా సదుపాయం మెరుగుపర్చడంతో ట్రాఫిక్ సులభతరం కానుందన్నారు.