VZM: వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం గజపతినగరం పోలీసు స్టేషను సందర్శించారు. మహిళా సంరక్షణ పోలీసులు, దత్తత గ్రామాల పోలీసు సిబ్బందితో మమేకమై, క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన విధులపై దిశా నిర్దేశం చేశారు. సైబరు మోసానికి గురైతే 1930కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ ఫిర్యాదు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.